AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope: ఈరోజు ఈ రాశుల వారికి ఉద్యోగాలు, వ్యాపారాలలో అనుకూలం.. రాశిఫలాలు..

ఇప్పటికీ చాలా మంది తమ భవిష్యత్తు గురించి ముందే తెలుసుకోవాలనుకుంటారు. ఇందులో భాగంగా రోజూ రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటారు.

Horoscope: ఈరోజు ఈ రాశుల వారికి ఉద్యోగాలు, వ్యాపారాలలో అనుకూలం.. రాశిఫలాలు..
Horoscope
Rajitha Chanti
| Edited By: Anil kumar poka|

Updated on: Aug 05, 2021 | 2:12 PM

Share

ఇప్పటికీ చాలా మంది తమ భవిష్యత్తు గురించి ముందే తెలుసుకోవాలనుకుంటారు. ఇందులో భాగంగా రోజూ రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటారు. ఈరోజు (ఆగస్ట్ 5న) బుధుడు చంద్రుడితోపాటు కర్కాటక రాశిలో ఉండనున్నాడు. దీంతో కర్కాటక, సింహ రాశుల వారికి అనుకూలంగా ఉంటంది. అలాగే ఈరోజు మిగత రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందామా.

మేష రాశి.. ఈరోజు వీరు అనుకున్న పనులను పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అలాగే కుటుంబసభ్యులతో విషయాలను చర్చిస్తారు. అలాగే ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి.

వృషభ రాశి.. ఈరోజు వీరు చేపట్టే పనులలో ఆటంకాలు, అనుకోని ధనవ్యయం కలుగుతుంది. కష్టం ఫలించదు. బంధువులతో తగాదాలు ఏర్పడతాయి. ఆరోగ్య సమస్యలు, వ్యాపారాలలో చిక్కులు ఏర్పడతాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఏర్పడుతుంది.

మిథున రాశి… ఈరోజు వీరికి నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అలాగే స్నేహితులను కలుసుకుంటారు. అలాగే భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకున్న పనులు జరుగుతాయి.

కర్కాటక రాశి.. ఈరోజు వీరు చేపట్టిన పనులలో ఆటంకాలు జరుగుతాయి. ఖర్చులు పెరుగుతాయి. అలాగే బంధువులతో తగదాలు ఏర్పడతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో ఆస్తి వివాదాలు ఏర్పడతాయి.

సింహ రాశి.. ఈరోజు వీరికి ఆశించిన విధంగా పనులు పూర్తి చేస్తారు. వీరికి పలుకుబడి పెరుగుతుంది. వ్యాపాభివృద్ది, ఉద్యోగాలలో అనుకూలంగా ఉంటుంది. వాహనయోగం కలుగుతుంది.

కన్య రాశి.. ఈరోజు వీరికి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సన్నిహితులు, బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. అలాగే వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలంగా ఉంటుంది.

తులా రాశి.. ఈరోజు వీరు కొత్తగా అప్పులు చేసే సూచనలు ఉన్నాయ. మానసికంగా ఒత్తిడి ఏర్పడుతుంది. అలాగే చేపట్టిన పనులు అర్థాంతరంగా ఆగిపోతాయి. అనుకోని ప్రయాణాలు, దైవదర్శనాలు జరుగుతుంటాయి.

వృశ్చిక రాశి.. ఈరోజు వీరికి ఆర్థికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. కుటుంబంలో చికాకులు కలుగుతుంటాయి. సోదరులతో ఆస్తి వివాదాలు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు కలుగుతాయి.

ధనుస్సు రాశి.. ఈరోజు వీరికి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార ఉద్యోగాలలో అనుకూలంగా ఉంటుంది.

మకర రాశి.. ఈరోజు వీరు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు, వ్యాపారాలలో అనుకూలంగా ఉంటుంది.

కుంభ రాశి.. ఈరోజు వీరు అనుకోకుండా ప్రయాణాలు జరుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో గొడవలు జరుగుతాయి.

మీన రాశి.. ఈరోజు వీరు ముఖ్యమైన పనులను వాయిదా వేస్తారు. అలాగే బంధువులతో వివాదాలు జరుగుతాయి. ఉద్యోగంలో చిక్కులు ఏర్పడతాయి.

Also Read: Pulichintala: పులిచింతల ప్రాజెక్టులో సాంకేతికలోపం.. విరిగిపడ్డ గేటు.. లక్ష క్యూసెక్కుల నీరు వృధా..!

Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్‏న్యూస్.. దిగొచ్చిన బంగారం ధరలు.. ఎంత తగ్గిందో తెలుసా..

మొసలికి చిక్కిన అడవి దున్న.. కట్ చేస్తే సీన్ రివెర్స్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!

బ్రతుకున్న పామును కరకరా నమిలి మింగేసిన యువకుడు.. కారణం తెలిస్తే షాకే.!