Pulichintala: పులిచింతల ప్రాజెక్టులో సాంకేతికలోపం.. విరిగిపడ్డ గేటు.. లక్ష క్యూసెక్కుల నీరు వృధా..!
ఆంధ్రప్రదేశ్‌లోని పులిచింతల ప్రాజెక్టు గేటు విరిగి పడిపోయింది. దీంతో భారీగా నీరు వృధా అవుతోంది. ఏం చేయలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
Pulichintala Project Crest Gate: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జలాశయాలకు వరద ఉధృతి పోటెత్తులోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ నిండు కుండలను తలపిస్తున్నాయి. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా పులిచింతల ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. వరద ఉధృతి కారణంగా గేట్లు ఎత్తే క్రమంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో ఒక గేటు విరిగి పడిపోవడంతో.. భారీగా నీరు వృధా అవుతోంది. ఏం చేయలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
పులిచింత ప్రాజెక్టులోకి పెరుగుతున్న వరద ప్రవాహాంతో నీటి ఒత్తిడి కారణంగా ఒక గేట్ విరిగి పడిపోయింది. 16వ నెంబర్ గేట్ విరిగిపోవడంతో వరద నీరు వృథాగా పోతోంది. గురువారం తెల్లవారజామున ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో భారీగా వరద నీరు వస్తుండడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే క్రమంలో ప్రమాదవశాత్తు గేటు విరిగిపడింది. వెల్డింగ్ ఊడిపోవడంతోనే గేటు విరిగినట్లు తెలుస్తోంది. దాదాపు లక్ష క్యూసెక్కుల నీరు వృథా పోతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. మరోవైపు, ప్రాజెక్టుపై నీటి ఒత్తిడి తగ్గించేందుకు 7 గేట్లను ఎత్తిన అధికారులు.. దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
మరోవైపు, నీటి వృధాను అడ్డుకునేందుకు ఎమర్జెన్సీ గేటు ఏర్పాటుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అది సాధ్యం కావడం లేదు. సమస్యను పరిష్కరించేందుకు ఏపీ నీటి పారుదల శాఖ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తతున్నారు. గేటు విరిగిపడడంతో ముందుజాగ్రత్తగా ప్రాజెక్టుపైకి రాకపోకలను నిలిపివేశారు. డ్యామ్ వద్ద సెక్యూరిటీని పెంచారు. ఎగువ నుంచి భారీగా వరద నీరు తరలి వస్తుండడంతో.. పులిచింతల ప్రాజెక్ట్ నిండు కుండలా మారింది. పులిచింతలకు ప్రస్తుతం 2,12,992 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు ఉండగా, ప్రస్తుతం 172.76 అడుగులు ఉంది. పులిచింతల పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 42.34 టీఎంసీలు ఉంది.
Read Also…