Puri Jagannath Temple: ఆగస్టు 23 నుంచి పూరీ జగన్నాథుడి ఆలయం ఓపెన్.. గుడిలోకి వెళ్లాలంటే ఇవి తప్పనిసరి..!
ఒడిశాలో కోవిడ్-19 కేసుల సంఖ్య బుధవారం నాటికి 9,82,181 కి పెరిగింది. కొత్తగా 1,315 మందికి పాజిటివ్ తేలగా, 66 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 6,168 కి పెరిగాయని అధికారులు తెలిపారు.
Puri Jagannath Temple: పూరీలోని జగన్నాథ్ ఆలయం ఆగస్టు 16 నుంచి 20 వరకు స్థానికులకు మాత్రమే అందుబాటులోకి తెస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు గురువారం ప్రకటించారు. శని, ఆది వారాల్లో వీకెండ్ లాక్‌డౌన్ ఉండడంతో బయటి వారికి ప్రవేశం లేదని పేర్కొన్నారు. పూరీలో ఆగస్టు 20 వరకు వీకెండ్ లాక్ డౌన్ ముగిసిన తరువాత భక్తులందరికి ఆగష్టు 23 నుంచి ప్రవేశం కల్పించనున్నారు. అయితే ఆలయంలోకి ప్రవేశించాలంటే మాత్రం RT-PCR పరీక్ష లేదా టీకా సర్టిఫికేట్ తప్పనిసరి చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కొవిడ్ కారణంగా గతేడాది పూరీ రథయాత్రకు భక్తులను అనుమతించలేదు. ఈ ఏడాది కూడా కోవిడ్ వ్యాప్తిలో ఉన్నందున గత నెలలో జగన్నాథుని రథయాత్ర పూరీకే పరిమితం చేసిన ప్రభుత్వం భక్తులు లేకుండానే చేపట్టింది.
ఒడిశాలో కోవిడ్-19 కేసుల సంఖ్య బుధవారం నాటికి 9,82,181 కి పెరిగింది. 1,315 మందికి పాజిటివ్ తేలగా, 66 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 6,168 కి పెరిగాయని అధికారులు తెలిపారు. క్వారంటైన్ సెంటర్లలో 762 కొత్త కేసులు నమోదయ్యాయి. కాంటాక్ట్ ట్రేసింగ్‌లో 553 మంది పాజిటివ్‌గా గుర్తించారు. పాజిటివిటీ రేటు 2.01 శాతంగా ఉందని అధికారులు తెలిపారు. ఒడిశా, పూరిలో కోవిడ్-19 కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని పుణ్యక్షేత్రాన్ని జూన్ 15 వరకు మూసివేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో మే 5 నుంచి భక్తులను ఆలయంలోకి రానివ్వడంలేదు. అనంతరం ఆగస్టు 20 వరకు అక్కడ వీకెండ్ లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్లు ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అప్పటి వరకు కేవలం స్థానికులకు మాత్రమే అందుబాటులో ఉంచనున్నారు. వీకెండ్ లాక్‌డౌన్ ముగిసిని అనంతరం అంటే ఆగస్టు 23 నుంచి బయట భక్తులకు కూడా ప్రవేశం కప్పించనున్నరు. దేవాలయ సభ్యులు స్వామికి జరిగే నిత్య సేవలను నిరాటంకంగా చేపడుతున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
Also Read: Ayodhya Ram Temple: రామ భక్తులకు శుభవార్త.. రామ్ లల్లా దర్శనానికి అనుమతి ఎప్పటినుంచంటే..
Ramappa: కాకతీయుల కళాత్మకతకు అద్భుతమైన శిల్పరీతి.. ఇసుక పునాదిపై వెలిసిన రామప్ప దేవాలయం
Bilwa Patra: బిల్వపత్రం ఎన్ని రకాలు.. ఏయే బిల్వపత్రాలతో పూజిస్తే ఏయే ఫలితాలు కలుగుతాయంటే