Ayodhya Ram Temple: రామ భక్తులకు శుభవార్త.. రామ్ లల్లా దర్శనానికి అనుమతి ఎప్పటినుంచంటే..

రామ భక్తులకు శుభవార్త వినిపించింది రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. సామాన్య భక్తుల దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లుగా తెలిపింది. అయోధ్యలో నిర్మించబడుతున్న...

Ayodhya Ram Temple: రామ భక్తులకు శుభవార్త.. రామ్ లల్లా దర్శనానికి అనుమతి ఎప్పటినుంచంటే..
Ram Lalla Ayodhya
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 04, 2021 | 6:40 PM

రామ భక్తులకు శుభవార్త వినిపించింది రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. సామాన్య భక్తుల దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లుగా తెలిపింది. అయోధ్యలో నిర్మించబడుతున్న శ్రీ రాముడి ఆలయం 2025 నాటికి పూర్తి స్థాయిలో సిద్ధం కానుంది. డిసెంబర్ 2023 నుండి రామ మందిరం భక్తుల కోసం తెరవబడుతుంది. అంటే, డిసెంబర్ 2023 నుండి భక్తులు దేవాలయానికి వచ్చి రామలాలాను దర్శించుకోవచ్చు. అయితే అప్పటి వరకు పాక్షికంగా ఆలయ నిర్మాణం పూర్తి కానుంది. రామ్ లల్లా ఉన్నటువంటి గర్భ గుడి ఆలయం పూర్తి కానుంది. మిగితా ప్రాంతంలో నిర్మాణ పనులు కొనసాగుతాయి. ఆలయంతో పాటు మ్యూజియం, డిజిటల్ ఆర్కైవ్‌లు, పరిశోధనా కేంద్రం కూడా ఆలయ సముదాయంలో నిర్మించబడతాయి.

దీనితో పాటు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ రామ్ భక్తులకు పెద్ద ఆఫర్ ప్రకటించింది. రామ భక్తులందరూ ఇప్పుడు రామ మందిర నిర్మాణ పనులను అక్కడికి వెళ్లి చూడవచ్చు. దీని కోసం ఒక వ్యూపాయింట్ నిర్మించబడుతుంది. అయోధ్యకు వచ్చే భక్తులు ఆలయ నిర్మాణ పనులను తమ కళ్లతో చూడగలుగుతారు.

రామలాలను ఇక ఇలా చూడవచ్చు..

దీనిని గతంలో టెంట్‌లో కూర్చొని ఉన్న రామ్ లల్లాను దర్శించుకుని వచ్చేవారు. ఇప్పుడు ఆ ప్రాంతం పూర్తి స్థాయిలో దేవాలయంగా మార్చేసింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. ఇప్పుడు రామ్ లల్లా భక్తులకు దర్శన దూరం కూడా తగ్గించబడింది. ఆలయ నిర్మాణానికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తరపున దేశవ్యాప్తంగా విరాళాలు సేకరించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో రామ మందిర నిర్మాణ కమిటీ నిర్మాణ పనులలో పూర్తిగా నిమగ్నమై ఉంది.

ఆగస్టు 5తో ఏడాది…

మరోవైపు, ఆగష్టు 5 న రాముడి దేవాలయ భూమి పూజ చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా పలు కార్యక్రమాలను నిర్వహించేందుకు ట్రస్ట్ సిద్దమవుతోంది. ఈ ప్రత్యేక కార్యక్రమాలకు సన్నాహాలు ట్రస్ట్ ద్వారా జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి: UDAN scheme: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఉడాన్ పథకంలో భాగంగా 40 విమాన మార్గాలు..

IND vs ENG 1st Test Live: తొలి ఓవర్‌లోనే టీమిండియా రివేంజ్.. తిప్పేసిన బుమ్రా..