చాణక్య నీతి: వీరు చేసే తప్పులకు మీరు శిక్ష అనుభావించాల్సి వస్తుంది.. చాణక్య చెప్పిన కీలక విషయాలు మీకోసం..

చాణక్య నీతి: పురాణాలు, వేదాలు, లేఖనాలలో కర్మ ఫలాల గురించి అనేక విషయాలు చెప్పబడ్డాయి. ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడో..

చాణక్య నీతి: వీరు చేసే తప్పులకు మీరు శిక్ష అనుభావించాల్సి వస్తుంది.. చాణక్య చెప్పిన కీలక విషయాలు మీకోసం..
Chanakya
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 04, 2021 | 1:28 PM

Chanakya Niti: పురాణాలు, వేదాలు, లేఖనాలలో కర్మ ఫలాల గురించి అనేక విషయాలు చెప్పబడ్డాయి. ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడో.. దాని ఫలితాలను తానే అనుభవిస్తాడనేది కర్మానుసారం అంటారు. అందుకే ప్రతీ వ్యక్తి సరైన మార్గంలో నడుచుకోవాలని, ధర్మ మార్గాన్ని అనుసరించాలని వేదాలు, పురాణాలు, మత గ్రంథాలు సూచించాయి. అయితే, కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఇతరుల చర్యలకు కూడా మీరు శిక్షను అనుభవించాల్సి ఉంటుందట. ఎందుకంటే.. మీ జీవితం వారు చేసే పనులపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నాయి. ఆధ్యాత్మిక గ్రంథాలు. ఈ నేపథ్యంలోనే.. ఇతరులకు ఎల్లప్పుడూ సరైన సలహాలు ఇవ్వాలని, తప్పుడు పనులు చేయకుండా నిరోధించాలని సూచించారు. అయితే, ఆచార్య చాణక్య తన చాణక్య నీతిలో ఇలాంటి కొంతమంది గురించి కూడా వివరించారు. ఇతరులు చేసే పనులు వల్ల వేరొకరు ఎలా కర్మఫలాలు అనుభవించాల్సి వస్తుందనే దాని గురించి వివరించారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. ఆచార్య చాణక్యుడు ఒక రాజు పాలనలో మంత్రులు, పూజారులు, సలహాదారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించలేనప్పుడు, ఆ రాష్ట్ర రాజు కూడా తన కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తించలేకపోతాడు. ఫలితంగా అతను తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు. అందుకే.. అతని తప్పుడు నిర్ణయాలకు కేవలం రాజ మందిరంలోని పూజారులు, సలహాదారులు, మంత్రులు మాత్రమే బాధ్యత వహిస్తారు. అంతేకాదు.. రాజు తప్పుడు నిర్ణయాల వల్ల అతని రాజ్యంతో సంబంధం ఉన్న వ్యక్తులతో సహా రాజ్యంలోని ప్రజలందరూ శిక్షించబడతారు. అందుకే రాజుకు సరైన మార్గాన్ని చూపించడం రాజమందిరంలో ఉండే పూజారి, సలహాదారు, మంత్రి ప్రధాన విధి. రాజుకు సరైన సలహా ఇవ్వడం, అతను తప్పు చేయకుండా నిరోధించడం వారి విధి.

2. వివాహం తర్వాత, భార్యాభర్తల సంబంధమే కాదు.. వారి జీవితాలు కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయని ఆచార్య చాణక్య చెప్పారు. ఈ నేపథ్యంలో, భార్య తప్పు చేస్తే, తన విధులను సక్రమంగా నిర్వర్తించకపోతే, ఆమె భర్త కూడా ఆమె చర్యలకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అందువల్ల ఇద్దరూ ఎల్లప్పుడూ ఒకరికొకరు సరైన మార్గాన్ని అనుసరించాలి.

3. ఒక శిష్యుడు ఒక మంచి పని చేస్తే, అప్పుడు గురువు కూడా కీర్తిని పొందుతాడు. ఒకవేళ అతను తప్పు చేస్తే, దాని పర్యవసానాలను గురువు కూడా అనుభవించాల్సి వస్తుంది. అందువల్ల, గురువు తన శిష్యుడు తప్పు చేయకుండా ఆపి, అతనికి మార్గనిర్దేశం చేయాలి అని చాణక్య కర్మ ఫలాలను వివరించారు.

Also read:

Barack Obama Birthday: ఒబామా జేబులో హనుమాన్ ప్రతిమ.. ఆసక్తికర విషయాలు మీకోసం..

Amara Raja Issue: ‘అమరరాజా’ వ్యవహారం ఏంటి?.. ఇన్ని విమర్శలెందుకు వస్తున్నాయి?.. ప్రభుత్వం ఏమంటోంది?.. పూర్తి వివరాలివే..

Andhra Pradesh: దివిసీమను భయపెడుతున్న విషసర్పాలు.. మూడు రోజుల్లో 21 మందిని కాటేశాయి..