AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visakha Agency: విశాఖపట్నం ఏజెన్సీలో గిరిజనుల అవస్థలు.. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళలను..

Visakha Agency: విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంత ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. సరైన సదుపాయాలు లేక నానా అవస్థలు పడుతున్నారు.

Visakha Agency: విశాఖపట్నం ఏజెన్సీలో గిరిజనుల అవస్థలు.. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళలను..
Doli
Shiva Prajapati
|

Updated on: Aug 05, 2021 | 12:11 PM

Share

Visakha Agency: విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంత ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. సరైన సదుపాయాలు లేక నానా అవస్థలు పడుతున్నారు. తాజాగా పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను ఆస్పత్రికి తరలించేందుకు వసతులు లేక.. డోలిలో మోసుకుంటూ 20 కిలోమీటర్లు ప్రయాణించారు. వివరాల్లోకెళితే.. విశాఖ ఏజెన్సీలోని చింతపల్లి మండలం బలపం పంచాయతీ మారుమూల తోకపాడు గ్రామంలో కుసంగి చంద్రమ్మ నిండు గర్భిణి. బుధవారం నాడు పురిటి నొప్పులు రావడంతో.. ఆమెను ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. అయితే రోడ్డు మార్గం లేకపోవడంతో.. వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మహిళ కుటుంబ సభ్యులు.. గ్రామస్తుల సహకారంతో.. ఎత్తయిన కొండ మార్గంలో అవస్థలు పడుతూ.. డోలిలో గర్భిణీని మోసుకెళ్లారు. దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోతుగెడ్డ ప్రైమరీ ఆస్పత్రికి తరలించారు. నిన్న బయలుదేరితే.. ఇవాళ ఉదయానికి వారు ఆస్పత్రికి చేరుకున్నారు. ఏజెన్సీలో రోడ్లు లేక, అంబులెన్స్ సౌకర్యం లేక ఎంతో మంది రోగులు, గర్భిణీలు ఇబ్బందులకు గురవుతున్నారని, ఇప్పటికైనా పాలకులు, అధికారులు తమ గోడు అర్థం చేసుకోవాలని ఏజెన్సీలో గిరిజనులు కోరుతున్నారు. రోడ్డు సౌకర్యం కల్పించాలని వేడుకుంటున్నారు.

Also read:

కరోనా కోరల్లో 8 రాష్ట్రాలకు కేంద్రం వార్నింగ్.. సెకండ్ వేవ్ ఇంకా పూర్తికాలేదు.. :COVID-19 second wave Video.

Silver Price Today: పెరిగిన వెండి ధరలు.. హైదరాబాద్‏లో 10 గ్రాముల సిల్వర్ ఎంతంటే..

Weather: తెలంగాణకు వర్ష సూచన.. రెండు రోజుల పాటు మోస్తారు వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ!