AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Viveka: మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక మలుపు.. 20 రోజులుగా తప్పించుకు తిరుగుతున్న కీలక నిందితుడు అరెస్ట్!

మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ట్విస్టుల మీద ట్టిస్టులు చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారుల మరింత పురోగతి సాధించారు.

YS Viveka: మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక మలుపు.. 20 రోజులుగా తప్పించుకు తిరుగుతున్న కీలక నిందితుడు అరెస్ట్!
Ys Viveka Murder Case
Balaraju Goud
|

Updated on: Aug 05, 2021 | 7:48 AM

Share

YS Vivekananda Murder Case: మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారుల మరింత పురోగతి సాధించారు. వివేకా హత్య కేసులో కీలక అనుమానితుడు సునీల్‌ కుమార్‌ యాదవ్‌ను సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. దీంతో నిందితుడికి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక అనుమానితుడు సునీల్‌ కుమార్‌ యాదవ్‌ను సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. సీబీఐ అధికారుల బృందం సునీల్‌ను కడప నుంచి పులివెందుల తీసుకెళ్లి అక్కడ మేజిస్ట్రేట్‌ ముందు ప్రవేశపెట్టారు. గోవా నుంచి తీసుకొచ్చిన అధికారులు రోజంతా కడప కేంద్ర కారాగారంలో విచారించారు. అనంతరం కడప రిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. కడప నుంచి పులివెందులకు సునీల్‌ను తీసుకెళ్లి మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చారు. కీలక నిందితుడిగా ఉన్న సునీల్‌ యాదవ్‌ గత 20 రోజులుగా సీబీఐ అధికారుల విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. గోవాలో అరెస్టు చేసిన సీబీఐ అధికారులు ట్రాన్సిట్‌ వారంట్‌పై కడప తీసుకొచ్చారు.

కాగా, సునీల్‌కుమార్ యాదవ్‌కు పులివెందుల మేజిస్ట్రేట్ 14 రోజులపాటు రిమాండ్‌ విధించింది. 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసి 14 రోజుల పాటు పులివెందుల మెజిస్ట్రేట్ కోర్టు రిమాండ్ విధించింది. అనంతరం అతన్ని కడప సెంట్రల్ జైలుకు తరలించారు సీబీఐ అధికారులు. గత కొన్ని రోజులుగా మమ్మల్ని వేధిస్తున్నారని సునీల్‌కుమార్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇదివరకే సీబీఐ అధికారుల వేధింపులకు తాళలేక ఉరి వేసుకొని చనిపోవడానికి ప్రయత్నిoచామని చెప్పారు. వివేకానంద రెడ్డి వాళ్లు తమకు దేవుడని, ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. తమను ఎప్పుడు, ఎవరు చంపేది తెలియదని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read Also…  Visakha Agency: విశాఖపట్నం ఏజెన్సీలో గిరిజనుల అవస్థలు.. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళలను..

Weather: తెలంగాణకు వర్ష సూచన.. రెండు రోజుల పాటు మోస్తారు వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ!