AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suicide: భర్త చేసిన అప్పు తీర్చేందుకు పుస్తెల తాడు తీసిచ్చిన భార్య.. అంతలోనే విషాదం..!

బాకీ డబ్బుల కోసం ఇద్దరు వ్యక్తులు పొద్దున్నే ఇంటికొచ్చి గొడవ చేశారు. ఇంట్లోకి చొరబడి భార్య మెడలో పుస్తెల తాడును లాక్కెళ్లారు. అవమానంగా భావించిన భర్త ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Suicide: భర్త చేసిన అప్పు తీర్చేందుకు పుస్తెల తాడు తీసిచ్చిన భార్య.. అంతలోనే విషాదం..!
Man Suicide After Disgrace
Balaraju Goud
|

Updated on: Aug 05, 2021 | 8:21 AM

Share

Nizamabad Man Suicide: నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీలో దారుణం జరిగింది. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదని మందలించినందుకు మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. బాకీ డబ్బుల కోసం ఇద్దరు వ్యక్తులు పొద్దున్నే ఇంటికొచ్చి గొడవ చేశారు. ఇంట్లోకి చొరబడి భార్య మెడలో పుస్తెల తాడును లాక్కెళ్లారు. అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరగడంతో అవమానంగా భావించిన భర్త ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

నిజామాబాద్ నగరంలోని దుబ్బ ప్రాంతానికి చెందిన నవాతే నాగరాజు (33) స్థానిక గంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఓ దుకాణంలో గుమాస్తాగా పని చేస్తున్నాడు. యజమానితో సంబంధం లేకుండా గుమస్తాలు వడ్లు కొని మారు వ్యాపారం కూడా చేస్తుంటారు. ఈ క్రమంలో తనకు దూరపు బంధువైన కమ్మర్‌పల్లి మండలం కొనసముందర్ గ్రామానికి చెందిన బాదం శ్రీనివాస్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరిలో నాగరాజు వడ్లు కొన్నాడు. ఇందుకోసం రూ. 3 లక్షల 20 వేలను శ్రీనివాస్‌‌కు చెల్లించాల్సి ఉండగా రూ.2 లక్షలు కట్టాడు. మార్చిలో లాక్‌‌డౌన్ వల్ల ఉపాధి లేక మిగిలిన సొమ్మ రూ. లక్షా 20 వేలు చెల్లించలేకపోయాడు. దీంతో ఈ మొత్తాన్ని బాకీ కింద జమకట్టిన శ్రీనివాస్.. కొంతకాలంగా నాగరాజుపై ఒత్తిడి చేస్తున్నాడు.

ఇదిలావుంటే, బాకీ వసూలు కోసం బుధవారం పొద్దున తన స్నేహితుడు లక్ష్మీనారాయణను వెంటేసుకొని నాగరాజు ఇంటికి శ్రీనివాస్‌‌ వెళ్లాడు. వెంటనే డబ్బులు చెల్లించాలని గొడవ చేశాడు. నాగరాజు కొత్త బైకును లాక్కు వెళ్లాడు వడ్డీ వ్యాపారి. అంతేగాక, ఓ రోజు నాగరాజును వడ్డీవ్యాపారి తన స్నేహితుడు లక్ష్మీనారాయణతో కలిసి పట్టుకుని చావబాదివదిలేశాడు. మరో రోజు నాగరాజు ఇంటికి వెళ్లి డబ్బు ఇవ్వాలని వడ్డీ వ్యాపారి గొడవపెట్టుకున్నాడు. వడ్డీ వ్యాపారి తన భర్తను వేధింపులకు గురిచేస్తోన్న తీరును చూసి భరించలేకపోయిన నాగరాజు భార్య అఖిల తన మెడలోకి బంగారు పుస్తెలతాడు తీసి వడ్డీ వ్యాపారికి ఇచ్చింది.

అయితే, తన భార్య పుస్తెల తాడు ఇవ్వడంతో నాగరాజు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో తన పరువు పోయిందని మనస్తాపం చెందిన నాగరాజు బెడ్రూంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎంతసేపైనా అతను తలుపు తీయకపోవడంతో పగలగొట్టి చూడగా నాగరాజు విగతజీవిగా కనిపించాడు. దీంతో స్థానికుల సాయంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read Also…  YS Viveka: మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక మలుపు.. 20 రోజులుగా తప్పించుకు తిరుగుతున్న కీలక నిందితుడు అరెస్ట్!

Follow Us
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!
టమాటాలతో ఎంపీ జన్మదిన వేడుకలు.. వినూత్న రీతిలో అభిమానం చాటుకున్న
టమాటాలతో ఎంపీ జన్మదిన వేడుకలు.. వినూత్న రీతిలో అభిమానం చాటుకున్న
KGBV పాఠశాలల్లో ప్రవేశాలకు 2026 దరఖాస్తు గడువు పొడిగింపు
KGBV పాఠశాలల్లో ప్రవేశాలకు 2026 దరఖాస్తు గడువు పొడిగింపు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు