AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blackmail : ‘ఆస్తి రాసిస్తావా? లేక పోలీసులకు ఫిర్యాదు చేయమంటావా?’.. కామారెడ్డి జిల్లాలో మహిళ అరాచకాలు..!

Blackmail : చనువుగా మెలుగుతూ.. బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్న మహిళ ఆటకట్టించారు కామారెడ్డి జిల్లా పోలీసులు.

Blackmail : ‘ఆస్తి రాసిస్తావా? లేక పోలీసులకు ఫిర్యాదు చేయమంటావా?’.. కామారెడ్డి జిల్లాలో మహిళ అరాచకాలు..!
Black Mail
Shiva Prajapati
|

Updated on: Aug 05, 2021 | 9:03 AM

Share

Blackmail : చనువుగా మెలుగుతూ.. బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్న మహిళ ఆటకట్టించారు కామారెడ్డి జిల్లా పోలీసులు. ఆస్తి రాసిస్తావా? లేక లైంగికంగా వేధించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేయాలా? అంటూ ప్రజాప్రతినిధులను బ్లాక్‌మెయిల్ చేసిన మహిళ అసలు గుట్టును రట్టు చేశారు పోలీసులు. ఈ వ్యవహారానికి సంబంధించిన పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని వండ్రికల్ గ్రామ సర్పంచ్‌ ఇంట్లో ఓ మహిళ అద్దెకు చేరింది. ఈ క్రమంలో ఆ సర్పంచ్‌తో మహిళ సన్నిహితంగా మెలగడం స్టార్ట్ చేసింది. అలా.. ఆ మహిళ ట్రాప్‌లో ప్రజాప్రతిని చిక్కుకున్నాడు. ఈ నేపథ్యంలో.. సదరు మహిళ ఆయనను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించింది. ఆస్తి రాసి ఇవ్వాలని, లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడింది.

ఈ క్రమంలోనే గ్రామ సర్పంచ్ తనను లైంగికంగా వేధించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది మహిళ. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకోగా.. బాధిత ప్రజాప్రతినిధి పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించాడు. మహిళ పట్ల తాను అసభ్యకరంగా ప్రవర్తించలేదని, జరిగిన విషయాన్నంతా చెప్పి తన గోడు వెళ్లబోసుకున్నాడు. దాంతో.. ఆ మహళ బ్లాక్‌మెయిలింగ్‌ వ్యవహారంపై పోలీసులు కూపీ లాగారు. గతంలో కూడా లింగంపేట్, ఎల్లారెడ్డి ప్రాంతాల్లో పలువురుని మహిళ బ్లాక్‌మెయిల్ చేసినట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న మిగతా బాధితులు.. మహిళ నుంచి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also read:

పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఏపీలో వన మహోత్సవం.. మంగళగిరి ఎయిమ్స్‌ ఆవరణలో ప్రారంభించనున్న సీఎం జగన్‌

ఆ బిస్కెట్ల ధరలు పెరగవచ్చు.. ఉత్పత్తి వ్యయం పెరగడంతో ప్రముఖ సంస్థ నిర్ణయం

Ghani Movie: వరుణ్ తేజ్ ఆగమనం అప్పుడేనా ? ‘గని’ మేకర్స్ ఏం చెప్పబోతున్నారు ?

ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..