Ghani Movie: వరుణ్ తేజ్ ఆగమనం అప్పుడేనా ? ‘గని’ మేకర్స్ ఏం చెప్పబోతున్నారు ?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం గని. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామాను డైరెక్టర్ కిరణ్

Ghani Movie: వరుణ్ తేజ్ ఆగమనం అప్పుడేనా ? 'గని' మేకర్స్ ఏం చెప్పబోతున్నారు ?
Varun Tej
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 05, 2021 | 8:46 AM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం గని. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామాను డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్నారు. ఇందులో వరుణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సాయి ముంజ్రేకర్ హీరోయిన్‏గా నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ షూటింగ్‏ను మొదటి పెట్టిన చిత్రయూనిట్.. క్లైమాక్స్ బాక్సింగ్ ఎపిసోడ్ షూట్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరింది. దీంతో మేకర్స్ అభిమానులకు అప్‏డేట్స్ ఇచ్చే పనిలో పడ్డారు. ఈరోజు సాయంత్రం 5.04 నిమిషాలకు గని నుంచి ఇంట్రెస్టింగ్ రాబోతుందని ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు.

అయితే తాజా సమాచారం ప్రకారం మేకర్స్ ఈరోజు సాయంత్రం గని రిలీజ్ డేట్‏కు సంబంధించిన అప్‏డేట్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను జూలై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. ప్రస్తుతం కోవిడ్ పరిస్థితులు చక్కబడడం.. తిరిగిల షూటింగ్స్ ప్రారంభం కావడంతో ఈ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేయాలనుకుంటున్నారట మేకర్స్. ఇక ఇదే విషయాన్ని ఇవాళ సాయంత్రం ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది. దీపావళి కానుకగా నవంబర్ 4న సూపర్ స్టార్ రజినీ కాంత్ నటిస్తున్న అన్నాత్తే మూవీ కూడా విడుదల కాబోతుంది. అన్నాత్తే తమిళ్‏తోపాటు తెలుగులోనూ విడుదల కానుంది. అయితే గని సినిమా కూడా దీపావళి కానుకగా రాబోతుండడంతో వీరిద్దరి మధ్య పోటీ ఎక్కువగానే ఉండేలా తెలుస్తోంది. గని చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో రెనాయ్‌సెన్స్ పిక్చర్స్ బ్యాన‌ర్ పై అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మిస్తున్నారు. ఇందులో న‌వీన్ చంద్ర‌, జ‌గ‌ప‌తిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర కీల‌క పాత్రలలో.. న‌దియా మ‌రో కీ రోల్ చేస్తుండగా.. ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం అందిస్తున్నాడు.

ట్వీట్..

Also Read: Karthika Deepam: మోనిత రాక్షసత్వం..దీప చాకచక్యం..డాక్టర్ బాబు బయటపడినట్టేనా?

Niharika Konidela: మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ.. పోలీసులను ఆశ్రయించిన అపార్ట్‏మెంట్ వాసులు..

Shalini Pandey- Ritika Singh: కారులో షికారుకెళ్తూ ఎంజాయ్ చేస్తున్న క్యూట్ హీరోయిన్స్.. మాములు రచ్చకాదుగా..