Today Horoscope: ఈ రాశివారు ఈ రోజు ఆర్థిక ఇబ్బందులను నుంచి బయటపడతారు.. చేపట్టే పనులలో అవాంతరాలు..!

Today Horoscope: ప్రస్తుత రోజుల్లో చాలా మంది తమ భవిష్యత్తు గురించి తెలుసుకునేందుకు రోజువారీ రాశిఫలాలను చూస్తుంటారు. రోజును ప్రారంభించే ముందు తమ తమ రాశిఫలాలు..

Today Horoscope: ఈ రాశివారు ఈ రోజు ఆర్థిక ఇబ్బందులను నుంచి బయటపడతారు.. చేపట్టే పనులలో అవాంతరాలు..!
Rasi Phalalu
Follow us
Subhash Goud

|

Updated on: Aug 06, 2021 | 7:00 AM

Today Horoscope: ప్రస్తుత రోజుల్లో చాలా మంది తమ భవిష్యత్తు గురించి తెలుసుకునేందుకు రోజువారీ రాశిఫలాలను చూస్తుంటారు. రోజును ప్రారంభించే ముందు తమ తమ రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. తాజాగా ఈ రోజు (ఆగస్టు 6) పలు రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం.

మేషం:

ఈ రాశివారు కొత్తగా చేపట్టే పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సానుకూలత ఉంటుంది.

వృషభం:

వీరు చేపట్టే పనులలో కొంత అవాంతరాలు ఏర్పడే అవకాశాలున్నాయి. ఆకస్మిక ప్రయాణాలు తప్పవు. బంధువులతో కొంత విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది. ముందుగానే జాగ్రత్తగా ఉంటూ పట్టించుకోకపోవడం మంచిది.

మిథునం:

ఈ రాశివారు చేపట్టే పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలలో కొంత సంతృప్తిగా ఉంటుంది. సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటారు. వ్యాపారులు, ఉద్యోగుల సమస్యలు తీరుతాయి.

కర్కాటకం:

భూ వివాదం విషయాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక విషయాలలో కొంత జాగ్రత్త వహించడం మంచిది. ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

సింహం:

వ్యాపారాలలో మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు.

కన్య:

ఇంటర్వ్యూలు రాగలవు. ఆస్తిలాభం. సోదరులతో విభేదాలు పరిష్కారం. శుభవార్తలు వింటారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు పరిష్కారం.

తుల:

ఈ రాశివారికి ఈ రోజు పరిస్థితులు అంతగా కలిసి రావు. కుటుంబ బాధ్యతలతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆలోచనలు నిలకడగా ఉంటాయి. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారులకు, ఉద్యోగస్తులకు వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

వృశ్చికం:

రుణాలు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తారు. మిత్రుల సలహాలు, సూచనలు పాటించడం మంచిది. ఆర్థికంగా కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయాలలో జాగ్రత్తగా ఉండటం ఎంతో మంచిది.

ధనుస్సు:

కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో మంచి గౌరవం దక్కుతుంది. ఆస్తులు వ్యవహారాలలో ఉన్న సమస్యలు కొంత తీరే అవకాశం ఉంది. వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలుంటాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

మకరం:

సన్నిహితులతో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వాహనయోగం కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మంచి ప్రోత్సాహం ఉంటుంది.

కుంభం:

పనులలో అవాంతరాలు ఏర్పడతాయి. రుణదాతల నుంచి ఒత్తిడిలు తప్పవు. ఆలయాలు సందర్శిస్తారు. అకస్మికంగా దూర ప్రయాణాలు తప్పవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు తప్పవు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

మీనం:

ఈ రాశివారు ఈ రోజు ఎంత శ్రమపడ్డ ఫలితం ఉండదు. ఆస్తుల కొనుగోలు విషయాలలో ఆటంకాలు తప్పవు. ఉద్యోగులకు చికాకులు తప్పవు. దూర ప్రయాణాలు చేస్తుంటారు. ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది.