AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Posani Krishna Murali : పోసాని కృష్ణ మురళి అరెస్టుపై భగ్గుమన్న వైసీపీ.. పలు చోట్ల నిరసనలు

ఆంధ్రప్రదేశ్‌ అరెస్టుల పర్వంలో పార్ట్ 2 మొదలైంది. వైసీపీ హయాంలో AP FDC చైర్మన్‌గా పనిచేసిన పోసాని కృష్ణమురళిని అరెస్ట్‌ చేయడం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించింది. రెడ్‌బుక్‌ రాజ్యాంగంలో భాగంగానే పోసానిపై కక్షగట్టారని వైసీపీ ఆరోపిస్తే .. ఎంతటివారైనా చేసిన పాపాలు అనుభవించాల్సిందేనంటూ మంత్రులు కౌంటర్ ఇచ్చారు.

Posani Krishna Murali : పోసాని కృష్ణ మురళి అరెస్టుపై భగ్గుమన్న వైసీపీ.. పలు చోట్ల నిరసనలు
Posani Krishna Murali
Basha Shek
|

Updated on: Feb 28, 2025 | 7:51 AM

Share

అరెస్టుల్లో ట్విస్ట్ ఇచ్చారు పోలీసులు. వల్లభనేని వంశీ తర్వాత కృష్ణాజిల్లాకు చెందిన ఇద్దరు లీడర్లలో ఒకరిని అరెస్ట్ చేస్తారంటూ బహిరంగంగానే కామెంట్ చేశారు టీడీపీ నేతలు. కానీ పోలీసులు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు. చంద్రబాబు, పవన్‌లపై పోసానిఅనుచిత వ్యాఖ్యలు చేశారని ఓబులవారిపల్లి పోలీసులు జనసేన నేత జోగినేని మణి ఫిర్యాదు చేశారు. పోసానిపై సెక్షన్‌ 196, 353(2), 111 రెడ్‌విత్ 3(5) కింద కేసు చేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టేలా పోసాని మాట్లాడారని, సినీ రంగాన్ని, కొన్ని కులాలను కించపరిచేలా మాట్లాడారని FIRలో పేర్కొన్నారు పోలీసులు. పోసానిని బుధవారం రాత్రి నాటకీయ పరిణామాల మధ్య హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి ఓబులవారిపల్లి పీఎస్‌కు తరలించారు పోలీసులు. దీంతో ఓబులవారిపల్లి పీఎస్‌కు భారీ సంఖ్యలో చేరుకున్న వైసీపీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరకంగా నినాదాలు చేశారు. అక్కడ కాసేపు టెన్షన్‌ వాతావరణం ఏర్పడింది.

రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే పోసాని కృష్ణమురళిపై కక్షసాధింపు చర్యలకు దిగారని మండిపడ్డారు వైసీపీ నేతలు. పోసాని అరెస్ట్‌పై వైఎస్‌ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడు అన్నీ చూస్తున్నాడన్నారు. పోసాని భార్యకు ఫోన్‌ చేసి పరామర్శించారు జగన్. మురళికి వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

పోసాని కృష్ణ మురళి భార్యతో మాట్లాడుతోన్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి..

మరోవైపు వైసీపీ హయాంలో కారుకూతలు కూసినవాళ్లంతా చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. అప్పుడు చేసిన పాపాలు ఇప్పుడు వారిని వెంటాడుతున్నాయన్నారు. ఇక పోసాని అరెస్ట్ రెడ్ బుక్ రాజ్యాంగం కానేకాదన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్‌. తప్పులు చేసినవారు శిక్షార్హులే అన్నారాయన.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి