AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sikandar: సల్మాన్, రష్మికల సికందర్ టీజర్ చూశారా? యాక్షన్ సీక్వెన్స్ అద్దిరిపోయాయిగా..

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'సికందర్'. రష్మిక మందన్న ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. రంజాన్ సందర్భంగా సికందర్ సినిమా విడుదల కానుంది. 'గజిని' ఫేమ్ ఎ.ఆర్. మురుగదాస్ 'సికందర్' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Sikandar: సల్మాన్, రష్మికల సికందర్ టీజర్ చూశారా? యాక్షన్ సీక్వెన్స్ అద్దిరిపోయాయిగా..
Sikandar Movie
Basha Shek
|

Updated on: Feb 27, 2025 | 9:29 PM

Share

సల్మాన్ ఖాన్ సినిమా అంటే ఊర మాస్ గా ఉండాలి. భారీ యాక్షన్ సీక్వెన్సులు, పంచ్ డైలాగ్‌లు ఉండాలి. సల్లూ అభిమానులు ఎక్కువగా ఇవే కోరుకుంటారు. ఇప్పుడు అలాంటి అంచనాలన్నింటినీ అందుకునేలా ‘సికందర్’ సినిమా టీజర్ గురువారం (ఫిబ్రవరి 27) విడుదలైంది. ఇందులో సల్మాన్ ఖాన్ ఊర మాస్ అవతారంతో కనిపించాడు. ఎప్పటిలాగే పోరాట సన్నివేశాల్లో అద్దరగొట్టాడు. ఎ.ఆర్. మురుగదాస్ ‘సికందర్’ చిత్రానికి దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సాజిద్ నదియా వాలా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా సల్లూ అభిమానులకు ఒక చిన్న సర్ ప్రైజ్ ఇస్తూ సికందర్ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.చాలా కాలం తర్వాత సల్మాన్ ఖాన్‌ను పెద్ద తెరపై చూడడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు సికిందర్ టీజర్ అంచనాలను పెంచేసింది. మురుగదాస్ గతంలో ‘గజిని’,  ‘స్టాలిన్’, ‘తుపాకి’, ‘కత్తి’, ‘స్పైడర్’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇక హిందీలో అమీర్ ఖాన్ తో ‘గజినీ’, అక్షయ్ కుమార్ తో ‘హాలిడే’, సోనాక్షి సిన్హాతో ‘అకీరా’, సల్మాన్ ఖాన్ తో ‘జయహో’ చిత్రాలను తెరకెక్కించారు. ఇక సల్మాన్‌ఖాన్‌తో మురుగదాస్‌ జత కట్టడం ఇది రెండో సారి.

‘సికందర్’ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన రష్మిక మందన్న నటించింది. ‘యానిమల్’ పుష్ప2. ‘ఛావా’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో రష్మిక మందన్న ఇప్పటికే బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసింది. ఇప్పుడు ‘సికందర్’ తో రష్మిక మరో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకునే అవకాశం దక్కింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ‘నడియాద్వాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథ ప్రస్తుతానికి వెల్లడి కాలేదు.

ఇవి కూడా చదవండి

రంజాన్ కానుకగా సినిమా రిలీజ్..

కాగా సికందర్ 2 తర్వాత ‘కిక్ 2’ చిత్రంలో కూడా నటిస్తున్నాడు సల్మాన్. అలాగే అట్లీతో కూడా ఓ సినిమా చేయనున్నాడని ప్రచారం జరుగుతోంది.

సల్మాన్ ఖాన్ సికందర్ టీజర్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..