Bunny Vasu: మెగా, అల్లు క్యాంపుల్లో బన్నీ వాసుకు ప్రాధాన్యం.. జనసేనలో కీలక బాధ్యతలు!
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బన్నీ వాసు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మెగా ఫ్యామిలీకి వీరాభిమాని అయిన ఆయన మొదట గీతా ఆర్ట్స్ సంస్థలో ఉద్యోగిగా చేరారు. ఆ తర్వాతి కాలంలో డిస్ట్రిబ్యూటర్ గా మారారు. ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బన్నీ వాసు ఇటీవల తండేల్ సినిమాతో మన ముందుకొచ్చారు. ఫిబ్రవరి 07న రిలీజైన ఈ సినిమా ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్ లో చేరింది. తద్వారా అక్కినేని నాగ చైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా తండేల్ నిలిచింది. అంతకు ముందు బన్నీ వాసు నిర్మించిన ఆయ్ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇలా నిర్మాతగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతోన్ బన్నీవాసు రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. స్వతహాగా మెగాభిమాని అయిన ఆయన అప్పట్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో పబ్లిసిటి కొ- ఆర్డినేషన్ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక జనసేన ప్రారంభం నుంచే పవన్ కల్యాణ్ వెన్నంటే వాసు ఉన్నారు. పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీలో బన్నీ వాసుకు మరింత ప్రాధాన్యం లభించనున్నట్లు తెలుస్తోంది. పార్టీ నిర్వహణకు సంబంధించి ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగనుంది. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లలో బన్నీవాసు ప్రముఖ పాత్ర పోషించనున్నారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనను పబ్లిసిటీ అండ్ డెకరేషన్ ఇన్‌ఛార్జ్‌గా నియమించినట్లు సమాచారం.
జనసేన ఆవిర్భావ సభకు సంబంధించిన నిర్వహణ ఏర్పాట్లన్నీ మొత్తం బన్నీ వాసు నేతృత్వంలో జరగనున్నాయని తెలుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చాక జనసేన మొదటి ఆవిర్భావ సభ కావటం తొ ఆంధ్రప్రదేశ్ రాజకీయనాయికుల చూపు ఈ సభపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి కీలక బాధ్యతలను బన్నీ వాసు కి అప్పజెప్పటం విశేషమనే చెప్పాలి. ఇక బన్నీవాసు కూడా తన నైపుణ్యంతో జనసేన ఆవిర్భావ దినోత్సవ సభను గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి ఇటు మెగా క్యాంప్ లోనూ, అటు అల్లు క్యాంప్ లోనూ బన్నీ వాసు మంచి పేరునే సంపాదించుకుంటున్నారని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.
తండేల్ సక్సెస్ మీట్ లో నిర్మాత బన్నీ వాసు..
Happy to see the success of Thandel, a film that beautifully captured the lives of fishermen and the vibrant culture of Srikakulam. Heartfelt congratulations to the entire team for this remarkable achievement, Special shoutout to @chay_akkineni Garu and @Sai_Pallavi92 Garu for… pic.twitter.com/YcnNJY23BC
— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) February 14, 2025




