- Telugu News Photo Gallery Cinema photos Tamannaah Bhatia following nandamuri bala krishna in that matter
Tamannaah Bhatia: బాలయ్య ను ఫాలో అవుతున్న మిల్కీ బ్యూటీ
మహాకుంభమేళాకు వెళ్లిన వారూ.. వచ్చిన వారే కాదు... ఆ దృశ్యాలను కలకాలం చూడాలనుకున్న వారి కోసం కూడా ఆలోచిస్తోంది తెలుగు సినిమా ఇండస్ట్రీ. ఆల్రెడీ మహా కుంభమేళాలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించింది అఖండ2 టీమ్. లేటెస్ట్ గా అక్కడే ప్రమోషన్లు మొదలుపెట్టింది ఓదెల 2 యూనిట్.
Updated on: Feb 26, 2025 | 7:50 PM

మహాకుంభమేళాకు వెళ్లిన వారూ.. వచ్చిన వారే కాదు... ఆ దృశ్యాలను కలకాలం చూడాలనుకున్న వారి కోసం కూడా ఆలోచిస్తోంది తెలుగు సినిమా ఇండస్ట్రీ. ఆల్రెడీ మహా కుంభమేళాలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించింది అఖండ2 టీమ్. లేటెస్ట్ గా అక్కడే ప్రమోషన్లు మొదలుపెట్టింది ఓదెల 2 యూనిట్.

తమన్నా ప్రధాన పాత్రలో అశోక్‌తేజ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఓదెల2. ఈ సినిమా టీజర్‌ని చిత్ర బృందం కుంభమేళాలో విడుదల చేసింది. శివశక్తిగా తమన్నా నటన ఆశ్చర్యపరుస్తుందన్నారు మేకర్స్.

ఓదెల ఫస్ట్ పార్టు సూపర్ డూపర్ హిట్ కావడంతో సెకండ్ పార్టును అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. నిర్మాతలకే కాదు... మిల్కీ బ్యూటీకి కూడా ఈ సినిమా సక్సెస్ చాలా ఇంపార్టెంట్.

రీసెంట్ టైమ్స్ లో భారీగా చెప్పుకోదగ్గ హిట్స్ లేవు తమన్నా ఖాతాలో. అందుకే ఈ లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ మీద ఫస్ట్ నుంచీ హోప్స్ పెట్టుకున్నారు. సినిమా స్టార్టింగ్ నుంచీ శివశక్తిగా మిల్కీ బ్యూటీ తనను తాను పోట్రే చేస్తున్న విధానం కూడా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతోంది.

ఈ ఏడాదే స్క్రీన్స్ మీదకు రానుంది ఓదెల సీక్వెల్. తమన్నాకున్న క్రేజ్‌తో మంచి ఓపెనింగ్స్ వస్తాయనే అంచనాలున్నాయి. రీసెంట్ టైమ్స్ లో స్పెషల్ సాంగులతో క్రేజ్‌ని కంటిన్యూ చేస్తున్నారు తమన్నా. ఆ ఎఫర్ట్ ఈ సినిమాకు ప్లస్ కావాలని కోరుకుంటున్నారు అభిమానులు.