Rashmika Mandanna: రష్మిక ను మెచ్చుకున్న రణ్‌బీర్ సతీమణి ఆలియా..
రియల్ సక్సెస్ అంటే ఎలా ఉంటుందో నన్ను చూసి తెలుసుకోండి అని చెప్పకనే చెప్పేస్తున్నారు నేషనల్ క్రష్. ఆమె సక్సెస్ అవుతున్న విధానాన్ని గమనించి నార్త్ హీరోయిన్లు సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చేస్తున్నారు. ఇంతకీ రష్మికను చూసి ఆలియాభట్ ఏమన్నారు? ఇప్పుడు శ్రద్ధాకపూర్ ఏం సాయం చేస్తున్నారు?
Updated on: Feb 26, 2025 | 7:39 PM

ఛావా సినిమాను థియేటర్లలో ఎంత భావోద్వేగంతో చూస్తున్నారో, అందులో నటించిన రష్మిక పెర్ఫార్మెన్సును కూడా అంతే హానెస్ట్ గా మెచ్చుకుంటున్నారు జనాలు. రష్మికకు కాంప్లిమెంట్స్ ఇచ్చిన వారి లిస్టులో లేటెస్ట్ గా చేరారు ఆలియాభట్.

ఛావా సినిమాలో రష్మిక చాలా అందంగా ఉన్నారని ప్రశంసించారు నటి ఆలియాభట్. ముఖ్యంగా రష్మిక కళ్లు అద్భుతంగా ఉన్నాయన్నారు. ఇప్పటిదాకా రష్మిక నవ్వును మెచ్చుకున్నవారే ఎక్కువ. అలాంటిది ఇప్పుడు ఆమె కళ్లకు కూడా కాంప్లిమెంట్స్ అందడం సూపర్ అంటూ ఖుషీ అవుతున్నారు అభిమానులు.

ఆల్రెడీ రణ్‌బీర్ కపూర్‌తో యానిమల్ సినిమా చేసినప్పుడే ఆలియాభట్‌తో పరిచయం ఉంది నేషనల్ క్రష్‌కి. ఆ సినిమా సమయంలోనూ రష్మిక పనితీరుకు ఫిదా అయ్యారు ఆలియా. నార్త్ లో ప్రస్తుతం సికిందర్‌లోనూ, థామాలోనూ నటిస్తున్నారు రష్మిక మందన్న.

బాలీవుడ్ హారర్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న థామా సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో శ్రధ్దా కపూర్ గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నారు.

హారర్ యూనివర్స్‌లో భాగంగానే వచ్చిన స్త్రీ 2 పాత్రను థామాలోనూ కంటిన్యూ చేయబోతున్నారు. సో, రష్మికకు ఈ రకంగా సపోర్ట్ చేస్తున్నారు శ్రద్ధా. సో, నార్త్ లో లేడీ గ్యాంగ్ మెయింటెయిన్ చేస్తున్నారన్నమాట రష్మిక.




