- Telugu News Photo Gallery Cinema photos Tollywood heroines like samantha shruti haasan nayanthara moving to bollywood fans in panic
అవకాశాలు ఇచ్చిన ఊరిని మర్చిపోతున్న ముద్దుగుమ్మలు.. ఇలా అయితే కష్టమే అంటున్న ఫ్యాన్స్
ఎప్పుడూ కనిపిస్తూ ఉంటేనే సినిమా ఇండస్ట్రీలో విలువ. కాసేపు పక్కకెళ్లి వస్తానంటే.. పక్కకెళ్లి ఆడుకోమ్మా అంటారు. ఆ విషయం తెలియక కాదు గానీ, ఎందుకో.. అప్పుడప్పుడూ బ్రేక్ కూడా అవసరమేగా అని అనుకుంటున్నారు కొంతమంది హీరోయిన్లు. కొందరు పని గట్టుకుని బ్రేక్ తీసుకోకపోయినా, వాళ్లు బ్రేక్‌లో ఉన్నారనే ఫీల్ ఆటోమేటిగ్గా క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు అర్జంటుగా యాక్టివ్ మోడ్‌ని ఆన్ చేయాల్సిన హీరోయన్లు ఎవరూ అంటే.. టాలీవుడ్‌లో మూవీ లవర్స్ మాత్రం వీళ్ల వైపు చూపించేస్తున్నారు.
Updated on: Feb 26, 2025 | 7:27 PM

సలార్‌లో కీ రోల్ చేశారు శ్రుతి హాసన్. ఆ తర్వాత ఏం చేశారంటే.. నానీ హాయ్ నాన్నలో సాంగ్ కనిపిస్తుంది. ఆ నెక్స్ట్ అంటే.. తెలుగు వాళ్లకు ఆన్సర్ లేదు. అలాగని శ్రుతి చేతిలో సినిమాలు లేవని కాదు. మన దగ్గర మాత్రం యాక్టివ్‌గా లేరని. ఇప్పుడు సమంత విషయంలోనూ సేమ్ కంప్లయింట్ వినిపిస్తోంది.

సామ్ ఖుషి తర్వాత తెలుగు ప్రాజెక్టులే చేయలేదు. ఆ మధ్య సిటాడెల్ వచ్చినా, ఇప్పుడు రక్త్ బ్రహ్మాండ్ ఉన్నా.. అవన్నీనార్త్ ప్రాజెక్టులే. అందుకే సామ్‌ని మిస్ అవుతున్నారు తెలుగు ఆడియన్స్.

ఇటు కాజల్‌కి తెలుగులో కన్నప్ప ఉంది. తమిళంలో ఇండియన్3 ఉంది. అయినా, పెద్దగా చప్పుడు చేయకపోవడంతో, కమ్ బ్యాక్ స్ట్రాంగ్‌గా ఉండేలా ప్లాన్ చేసుకోమనే సజెషన్స్ అందుతున్నాయి అమ్మణికి.

నయనతార విక్కీ పీడియా ఓపెన్ చేస్తే వరుసగా సినిమాల లిస్టు కనిపిస్తుంది. కానీ, ఆ సినిమా పేర్లు కూడా మనకు చాలా కొత్తగా అనిపిస్తాయి. వాటిని మన వాళ్లు అర్థం చేసుకోవడానికి కచ్చితంగా సమయం పడుతుంది.

అందుకే... ఇదంతా ఎందుకు నయన్.. పక్కా తెలుగు సినిమాకు సంతకం చేసేయండని రిక్వెస్ట్ చేస్తున్నారు అభిమానులు. ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉన్న ఇండస్ట్రీలను హీరోయిన్లు నెగ్లెక్ట్ చేయడం మంచిది కాదనే సలహాలూ గట్టిగానే వినిపిస్తున్నాయి. రకుల్, రాశీ లాంటి వారికీ ఇది వర్తిస్తుందండోయ్.




