- Telugu News Photo Gallery Cinema photos Tollywood movies like Vishwambhara, toxic, mirai releasing dates may postpone
చిరు రూట్లో ప్రభాస్, రవితేజ, యష్ నడుస్తారా ?? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్
మెగాస్టార్ చిరంజీవిని ఫాలో అవుతున్నారు యంగ్ హీరో తేజ సజ్జా. ఈ ఇయర్ ఇంకెవరెవరు ఫాలో అవుతారు? అనేది హాట్ టాపిక్. ఈ లిస్టులో డార్లింగ్ పేరు, రాకీ భాయ్ పేరు గట్టిగా వినిపిస్తోంది. వాళ్లు ఇచ్చిన మాట మీదే ఉంటారా? లేకుంటే ఆఖరి నిమిషంలో తూచ్ అంటారా? హనుమాన్ తర్వాత మిరాయ్ చేస్తున్నారు తేజ సజ్జా.
Updated on: Feb 26, 2025 | 7:01 PM

మెగాస్టార్ చిరంజీవిని ఫాలో అవుతున్నారు యంగ్ హీరో తేజ సజ్జా. ఈ ఇయర్ ఇంకెవరెవరు ఫాలో అవుతారు? అనేది హాట్ టాపిక్. ఈ లిస్టులో డార్లింగ్ పేరు, రాకీ భాయ్ పేరు గట్టిగా వినిపిస్తోంది. వాళ్లు ఇచ్చిన మాట మీదే ఉంటారా? లేకుంటే ఆఖరి నిమిషంలో తూచ్ అంటారా?

హనుమాన్ తర్వాత మిరాయ్ చేస్తున్నారు తేజ సజ్జా. ఈ సమ్మర్‌కి వచ్చేస్తానని ఎప్పుడో అనౌన్స్ చేశారు. కానీ వీఎఫ్ఎక్స్ పనులు ఆలస్యమవుతుండటంతో ఆగస్టు ఒకటిన వస్తానని లేటెస్ట్ గా ప్రకటించారు.

చెర్రీ కోసం మెగాస్టార్ విశ్వంభర రిలీజ్ డేట్ వాయిదా వేసుకుంటే, గ్రాఫిక్స్ పనుల కోసం తేజ సజ్జా మిరాయ్ మూవీని పోస్ట్ పోన్ చేశారు. ఏప్రిల్ 10న నేను రావడం గ్యారంటీ అని ఎప్పుడో మాటిచ్చేశారు రాకీభాయ్.

కేజీయఫ్ సెకండ్ చాప్టర్ తర్వాత టాక్సిక్‌ని మొదలు పెట్టడానికే ఎక్కువ సమయం తీసుకున్నారు యష్. దానికి తోడు, షెడ్యూల్స్ షఫిల్ కావడంతో టాక్సిక్ చెప్పిన టైమ్‌కే వస్తుందా? అనే అనుమానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

రాజా సాబ్, మాస్ జాతర కూడా చెప్పిన టైమ్‌కి రావనే మాట ఆల్రెడీ స్ప్రెడ్ అయింది. నయా డేట్‌ని మేకర్స్ త్వరలోనే ప్రకటించేస్తారని ఫ్యాన్స్ కూడా దాదాపుగా ఫిక్సయిపోయారు. సో, ఈ ఏడాది చిరుని ఫాలో అయ్యే స్టార్ హీరోల సంఖ్య బాగానే కనిపిస్తోందన్నమాట.




