- Telugu News Photo Gallery Cinema photos Upcoming movies like Vishwambhara, odela 2, akhanda 2 shooting updates on 26 02 2025
స్పీడ్ పెంచిన సీనియర్ హీరోలు.. తగ్గేదే లే.. ఈ సారి దబిడి దిబిడే
నువ్వొకటి అనౌన్స్ చెయ్.. నేను ఇంకోటి లైన్లో పెడతా.. అరే.. మీరిద్దరూ పోటాపోటీగా చెప్పేస్తుంటే, మేమెందుకు ఖాళీగా ఉంటాం..మేం కూడా రేసులోనే ఉంటాం... చిరంజీవి, బాలయ్య, రజనీకాంత్, కమల్‌హాసన్ కలిసి కూర్చుంటే, మాటలన్నీ అచ్చం ఇలాగే ఉంటాయేమో... ఇంతకీ విషయమేంటో మీకు అర్థమైందిగా...
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Feb 26, 2025 | 6:11 PM

చిరంజీవితో శ్రీకాంత్ ఓదెల సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయిపోతుందని నాని ఇలా చెప్పారో లేదో.. వెంటనే చిరు మూవీస్ లిస్టు చెక్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు విశ్వంభర, ఇమీడియేట్‌గా అనిల్ రావిపూడి సినిమాలున్నాయి మెగా ఖాతాలో.

ఆ వెంటనే శ్రీకాంత్ ఓదెల మూవీ, ఆ తర్వాత మచ్చ రవి, హరీష్ శంకర్ సినిమా.. ఇలా లిస్టు పెద్దగానే కనిపిస్తోంది. ఎన్ని ఉన్నా.. ఇమీడియేట్‌గా చిరు అడుగుపెట్టేది మాత్రం సంక్రాంతికి వస్తున్నాం కెప్టెన్ అనిల్ రావిపూడి సెట్స్ కే!

రీసెంట్‌గా డాకు మహారాజ్‌తో దబిడి దిబిడే అన్న బాలయ్య నెక్స్ట్ సినిమా అఖండ2 ఆల్రెడీ సెట్స్ మీదుంది. దీని తర్వాత గోపీచంద్ మలినేని సినిమా ఉంది. బాబీతో ఇంకో సినిమా చేయడానికి సై అంటున్నారు..

మన సీనియర్లకు గట్టి పోటీనిస్తున్నారు కోలీవుడ్ స్టార్ హీరోలు. ఏజ్ జస్ట్ నెంబరే అంటున్నారు రజనీకాంత్. కూలీ రిలీజ్‌కి రెడీ అవుతుంటే, జైలర్2 ఆన్ లొకేషన్‌లో రెడీగా ఉంది. మరోవైపు వెట్రిమారన్‌తో స్టోరీ సిట్టింగ్స్ లో ఉన్నారు తలైవర్.

యూనివర్శల్ స్టార్ కమల్‌హాసన్ అసలు ఖాళీగా లేరు. మణిరత్నం థగ్‌లైఫ్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. లోకేష్ కోసం ఖైదీ2 లో గెస్ట్ రోల్ చేయాలి. లైన్లో కల్కి2.. హెచ్.వినోద్ సినిమా ఉన్నాయి... ఇవన్నీ ఆల్రెడీ మీకు తెలిసినవే. ఇంకా మేం లీక్ చేయనివి చాలానే ఉన్నాయ్ అంటున్నారు లోకనాయకుడు. సీనియర్ల స్పీడ్ చూసి, యంగ్ హీరోలందరూ అలర్ట్ కావాలంటున్నారు క్రిటిక్స్.





























