- Telugu News Photo Gallery Cinema photos Actress ananya nagalla visit srisailam temple photos goes viral
Ananya Nagalla: శ్రీశైలం శివయ్యను దర్శించుకున్న అనన్య నాగళ్ల.. ఫొటోస్ వైరల్
వరుసగా సినిమాలు చేస్తూ అనతికాలంలోనే తెలుగు నాట క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది అనన్య. ఓవైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే, మరోవైపు సహాయనటిగా ఇతర హీరోల సి చిత్రాల్లోనూ మెప్పిస్తోందీ ఈ చిన్నది. షాదీ అనే షార్ట్ ఫిల్మ్ లో నటించినందుకు ఆమెకు ఉత్తమ నటిగా సైమా అవార్డ్ అందుకుంది.
Rajeev Rayala | Edited By: TV9 Telugu
Updated on: Feb 27, 2025 | 4:20 PM

సినిమాలపై ఇంట్రెస్ట్ తో సాఫ్ట్ వేర్ జాబ్ మానేసింది అందాల భామ అనన్య నాగళ్ల. షార్ట్ ఫిల్మ్స్ తో మరో కొత్త జీవితం ప్రారంభించింది. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు.

ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ అనతికాలంలోనే తెలుగు నాట క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఓవైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే, మరోవైపు సహాయనటిగా ఇతర హీరోల సి చిత్రాల్లోనూ మెప్పిస్తోందీ ఈ చిన్నది.

షాదీ అనే షార్ట్ ఫిల్మ్ లో నటించినందుకు ఆమెకు ఉత్తమ నటిగా సైమా అవార్డ్ అందుకుంది. ఆ తర్వాత ప్రియదర్శితో కలిసి మల్లేశం అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తర్వాత మ్యాస్ట్రో, ఊర్వశివో రాక్షసివో, శాకుంతం, మళ్లీపెళ్లి, పొట్టేల్, తంత్ర తదితర సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.ఇటీవల అనన్య నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో ఆమె పోషించిన పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనన్య తాజాగా కొన్ని ఫోటోలను పంచుకుంది. శివరాత్రి కావడంతో శ్రీశైలం వెళ్ళింది. అక్కడి నుంచి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది అనన్య. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.





























