AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shakeela OTT: ఐదేళ్ల తర్వాత సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన షకీలా బయోపిక్.. ఎక్కడ చూడొచ్చంటే?

ప్రముఖ శృంగార తార షకీలా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం షకీలా. 2020 డిసెంబర్ 25న థియేటర్లలో ఈ చిత్రం విడుదలైంది. ఎక్కువగా అడ‌ల్ట్ అండ్ బోల్డ్ కంటెంట్ ఉండటంతో సెన్సార్ బోర్డ్ షకీలా సినిమాకు ‘ఎ’ సర్టిఫికెట్‌ అందించింది.

Shakeela OTT: ఐదేళ్ల తర్వాత సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన షకీలా బయోపిక్.. ఎక్కడ చూడొచ్చంటే?
Shakeela Movie
Basha Shek
|

Updated on: Feb 27, 2025 | 4:37 PM

Share

ప్రముఖ నటి షకీలా జీవితం ఆధారంగా బాలీవుడ్ లో తెరకెక్కిన చిత్రం షకీలా. ఇంద్రజీత్‌ లంకేశ్‌ తెరెక్కించిన ఈ బయోపిక్ లో షకీలా పాత్రలో బాలీవుడ్ అందాల తార రిచా చద్దా నటించింది. అలాగే పంకజ్‌ త్రిపాఠీ, టాలీవుడ్ నటి ఎస్తర్‌ నోరన్హ, రాజీవ్‌ పిళ్లై, శివ రానా, కాజోల్‌ చుగ్, సందీప్‌ మలని తదితరులు కీలక పాత్రలు పోషించారు. 2020 డిసెంబర్ 25న థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. హిందీ, తమిళ,తెలుగు, కన్నడ భాషల్లో ఈ బయోపిక్ ను రిలీజ్‌ చేశారు. అయితే షకీలా సినిమా యావరేజ్ గా నిలిచింది. ఎక్కువగా అడల్డ్ కంటెంట్ ఉండడంతో ఓ వర్గం ప్రేక్షకులు మాత్రమే ఈ సినిమాను ఆదరించారు. దీనికి తోడు షకీలాకు ఉన్న క్రేజ్‌ వల్ల ఈ మూవీ విడుదలైన వెంటనే పైరసీ బారిన పడింది. ఏకంగా యూట్యూబ్‌లలో కూడా ఈ చిత్రాన్ని షేర్‌ చేశారు. కాగా ఇప్పుడీ బోల్డ్ మూవీ సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన ఐదేళ్ల తర్వాత షకీలా మూవీ స్ట్రీమింగ్ కు రావడం గమనార్హం. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో షకీలా సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతం కేవలం హిందీ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో టాలీవుడ్‌ ఆడియెన్స్ తెలుగు వర్షన్‌ కోసం సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. అయితే మరో రెండురోజుల్లో షకీలా తెలుగు వర్షన్‌ కూడా స్ట్రీమింగ్‌కు రావచ్చని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..

ప్రకాష్‌ పళని సమర్పణలో సమ్మి నన్వనీ, శరవణ ప్రసాద్‌ ‘షకీలా’ చిత్రాన్ని నిర్మించారు. వీర్ సమర్థ్ సంగీతం అందించారు. కాగా మహేష్ బాబు హీరోగా నటించిన పోకిరి సినిమాలో ప్రకాశ్ రాజ్ గర్ల్ ఫ్రెండ్ గా నటించిన శివ్ రానా ఈ సినిమాలో సిల్క్ స్మిత రోల్ పోషించడం విశేషం. సినిమా ఇండస్ట్రీలో మంచి న‌టిగా పేరు తెచ్చుకోవాల‌నుకున్న ష‌కీలా.. శృంగార తార‌గా ఎలా మారిందన్నదే సినిమా కథ. షకీలా పడ్డ కష్టాలు, సొంత కుటుంబ సభ్యుల నుండి ఆమెకు ఎదురైన అవమానాలు, మోసాలను ఈ మూవీలో చూపించారు

షకీలా సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
5వ మ్యాచ్‌లో ఓడిన భారత్.. 3-2తేడాతో సిరీస్ గెలిచిన శ్రేయాస్ సేన
5వ మ్యాచ్‌లో ఓడిన భారత్.. 3-2తేడాతో సిరీస్ గెలిచిన శ్రేయాస్ సేన
బ్యాలెట్ పేపర్లలో కనిపించని సైకిల్, కమలం గుర్తు..!
బ్యాలెట్ పేపర్లలో కనిపించని సైకిల్, కమలం గుర్తు..!
ఇంట్లోని డీప్ క్లీనింగ్‌లో లైట్ బల్బులను ఎలా శుభ్రం చేయాలి? ఈజీగా
ఇంట్లోని డీప్ క్లీనింగ్‌లో లైట్ బల్బులను ఎలా శుభ్రం చేయాలి? ఈజీగా
తొలి బుల్లెట్‌ రైలు.. తొలిసారి అరుదైన దృశ్యాలు షేర్ చేసిన మంత్రి
తొలి బుల్లెట్‌ రైలు.. తొలిసారి అరుదైన దృశ్యాలు షేర్ చేసిన మంత్రి
మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయని మాజీ సీఎం జగన్
మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయని మాజీ సీఎం జగన్
ఏపీకి మరో ముప్పు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
ఏపీకి మరో ముప్పు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
ఓటీటీలో మరో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో మరో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
అమెరికా కళ్లుగప్పి రహస్య నెట్‌వర్క్ నుంచి ఆయుధాలు కొంటున్న ఇరాన్
అమెరికా కళ్లుగప్పి రహస్య నెట్‌వర్క్ నుంచి ఆయుధాలు కొంటున్న ఇరాన్
తీరానికి అకస్మాత్తుగా అరుదైన తాబేళ్లు...160కి. మీ మేర లాక్‌డౌన్!
తీరానికి అకస్మాత్తుగా అరుదైన తాబేళ్లు...160కి. మీ మేర లాక్‌డౌన్!
10 రోజుల్లో బంగారం, వెండి ఎంత తగ్గిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
10 రోజుల్లో బంగారం, వెండి ఎంత తగ్గిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!