Aadhi Pinisetty: భార్య నిక్కీ గల్రానీతో విడాకుల వార్తలు.. సంచలన విషయం బయట పెట్టేసిన హీరో ఆది
నిక్కీ గల్రానీతో పెళ్లి తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు ప్రముఖ హీరో ఆది పినిశెట్టి. సుమారు రెండేళ్ల గ్యాప్ తర్వాత శబ్ధం అంటూ ఓ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీతో మన ముందుకు వస్తున్నాడీ ట్యాలెంటెడ్ హీరో. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న ఆది పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు

నటుడు ఆది పినిశెట్టి గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. స్టార్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు ఆది. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా రంగస్థలంలో రామ్ చరణ్ అన్నయ్య పాత్రలో ఆది నటన అందరికీ కన్నీళ్లు తెప్పించింది. కాగా గతంలోలా ఇప్పుడు ఎక్కువగా సినిమాల్లో కనిపించడం లేదీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఆది చివరిగా 2023లో రిలీజైన పార్ట్ నర్ సినిమాలో నటించాడు. మళ్లీ ఇప్పుడు శబ్ధం సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 28న థియేటర్లలో రిలీజ్ కానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్లలో ఆది చురుగ్గా పాల్గొంటున్నాడు. ఈ క్రమంలోనే తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నాడు. ఇదే సందర్భంగా తన భార్య ప్రముఖ హీరోయిన్ నిక్కీ గల్రానీతో విడిపోతున్నట్లు వస్తోన్న వార్తలపైనా ఈ నటుడు స్పందించాడు.
‘‘నిక్కీ నాకు మొదటి నుంచి మంచి స్నేహితురాలు. నా కుటుంబసభ్యులకు కూడా ఆమె అంటే ఎంతో ఇష్టం. మా ఇంట్లో వాళ్లు కూడా నిక్కీకి బాగా నచ్చారు. ఆమెతో ఉంటే నేను సంతోషంగా ఉంటాననిపించింది. అందుకే ఇరు పెద్దల అంగీకారంతోనే మేము వివాహం చేసుకున్నాం. మేం ఎంతో సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తున్నాం. అయితే ఈ మధ్యన మేమిద్దరం విడాకులు తీసుకుంటున్నామని యూట్యూబ్‌లో కథనాలు వచ్చాయి. మొదట వాటిని చూసి నేను షాకయ్యాను. బాగా కోపం వచ్చింది. ఆ తర్వాత ఆయా ఖాతాల్లో ఉన్న పాత వీడియోలు చూశాను. వారు అన్నీ ఇలాంటి వీడియోలే పెడుతున్నారని అర్తమైంది. దీంతో వాళ్లను పట్టించుకోకపోవడం మంచిదనిపించింది. క్లిక్స్ కోసం ఎంతకైనా తెగిస్తారని అప్పుడే నాకు అర్థమైంది’ అని ఆది పినిశెట్టి చెప్పుకొచ్చారు.
వాలంటైన్స్ డే వేడుకల్లో ఆది- నిక్కీ గల్రానీ..
View this post on Instagram
ఆది పిని శెట్టి, నిక్కీ గల్రానీలది ప్రేమ వివాహం. వీరిద్దరూ పలు సినిమాల్లో హీరో, హీరోయిన్లుగా నటించాడు. ఈ క్రమంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు.ఆ తర్వాత పెద్దల అనుమతితో 2022 మే 18న పెళ్లిపీటలెక్కారు.
దీపావళి వేడుకల్లో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








