మాట నిలబెట్టుకున్న మ్యాడ్ టీం! కడుపుబ్బా నవ్విస్తున్న టీజర్
'మ్యాడ్'కి రెట్టింపు వినోదాన్ని పంచనున్నట్లు టీజర్ తో హామీ ఇచ్చారు 'మ్యాడ్ స్క్వేర్' టీం. ఇక బ్లాక్ బస్టర్ చిత్రం 'మ్యాడ్'కి సీక్వెల్ గా 'మ్యాడ్ స్క్వేర్'ను ప్రకటించినప్పటి నుంచి సినీ ప్రియులంతా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'లడ్డు గానీ పెళ్లి', 'స్వాతి రెడ్డి' పాటలు ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.
ఇప్పుడు ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లేలా ‘మ్యాడ్ స్క్వేర్’ నుంచి టీజర్ విడుదలైంది. అందర్నీ కడుపుబ్బా నవ్విస్తోంది. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ‘మ్యాడ్ స్క్వేర్’ టీజర్ రిలీజైంది. రిలీజైన నిమిషాల్లోనే ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వేసవికి ‘మ్యాడ్ స్క్వేర్’, ప్రేక్షకులకు మరిచిపోలేని వినోదాన్ని పంచనుందని టీజర్ తో తెలుగు ప్రేక్షకులకు తెలిసిపోయింది. డైరెక్టర్ కళ్యాణ్ శంకర్, ఈ సీక్వెల్ తో మరోసారి నవ్వుల విందుని అందించబోతున్నారు. మొదటి భాగంలో తమ అల్లరితో నవ్వులు పూయించిన నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మరియు విష్ణు ఓఐ అలియాస్ లడ్డు.. ‘మ్యాడ్ స్క్వేర్’లో అంతకుమించిన అల్లరి చేయబోతున్నారు. టీజర్ లో వారి అల్లరి, పంచ్ డైలాగ్ లు కడుపుబ్బా నవ్విస్తున్నాయి. మ్యాడ్ స్క్వేర్ ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రేక్షకులు ఊహించిన దానికంటే ఎక్కువ వినోదాన్ని, ఎక్కువ మ్యాడ్ నెస్ ను మ్యాడ్ స్క్వేర్ లో చూడబోతున్నారని చిత్ర బృందం తెలిపింది. 2025, మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిన్న పార్టీకే.. లక్షల్లో ఖరీదైన డ్రెస్! కీర్తి సురేష్ భర్తతో మామూలుగా ఉండదు
Mumaith Khan: ముమైత్ ఖాన్.. ఇప్పుడు టార్గెట్ తెలుగు యూతే!
Thandel: గుడ్ న్యూస్ తండేల్ OTT డేట్ ఫిక్స్?
భర్తకు రూ.150 కోట్ల ఆస్తి.. పైగా తను కోట్ల హీరోయిన్! ఇక ఊరుకుంటుందా?

ఒక్క టూత్ బ్రష్తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి

ఏసీ కోచ్ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..

వారానికి 90 గంటల పని.. రోడ్డెక్కిన టెకీలు

ఈ చిన్నారుల ట్యాలెంట్కి ఎవరైనా అదరహో అనాల్సిందే

చనిపోయిన కుక్క జన్యువులతో క్లోనింగ్.. ఖర్చు రూ. 19 లక్షలా

ఉరుములకు భయపడిన ఉడుత.. ఏం చేసిందంటే..
