Prabhas: ఎంతైనా ప్రభాస్ గొప్పోడు భయ్యా! ఆస్పత్రిలో ఉన్న రచయిత కోసం ఏ చేశాడో తెలుసా?
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ గొప్ప మనసు గురించి అందరికీ తెలిసిందే. సెట్‌లోని వారికి ఇంటిభోజనం తెచ్చి కడుపు నింపే డార్లింగ్ ఆపదలో ఉన్న వారికి నేనున్నానంటూ ఆపన్నహస్తం అందిస్తాడు. అలా ఆస్పత్రిలో ఉన్న ఓ ప్రముఖ రచయిత కోసం ప్రభాస్ చేసిన మంచి పనిని అందరూ మెచ్చుకుంటున్నారు.

కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేతికి తెలియకూడదంటారు. అలా మనకు తెలియకుండానే ఎన్నో మంచి పనులు చేశాడు. ఆపదలో ఉన్న అభిమానులు, సినీ కార్మికులకు తన వంతు సాయం చేశాడు. అలా ప్రభాస్ సాయం పొందిన వారిలో తాను ఉన్నానంటున్నాడు ప్రముఖ రచయిత తోట ప్రసాద్. ప్రభాస్ నటించిన బిల్లా సినిమాకు ఆయన రచయితగా పనిచేశారు. ఈక్రమంలో ఇటీవలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన తోట ప్రసాద్ ప్రభాస గొప్ప తనం గురించి ఇలా చెప్పుకొచ్చారు. ‘ప్రభాస్ చాలా గొప్ప మనసు కలవాడు. ఆయన నటించిన బిల్లా సినిమాకి నేను రచయితగా చేశాను. ఆ కొద్దిపాటి పరిచయంతోనే ఆయన నాకు ఎప్పటికీ మర్చిపోలేని సహాయం చేశాడు. నేను 2010లో ఓసారి ఆస్పత్రి పాలయ్యాను. అయితే నేను హాస్పిటల్లో ఉన్న సంగతి తెలుసుకున్న ప్రభాస్ నా వైద్యానికి అవసరమయ్యే డబ్బు పంపించారు. అయితే ఇందులో గొప్పే ముంది చాలా మంది హీరోలు చేశారు కదా? అని మీరు అనుకోవచ్చు. కానీ అసలు విషయం ఏమిటంటే.. నేను ఆస్పత్రిలో ఉన్న రోజే ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు గారు కన్ను మూశారు’
‘తండ్రి మరణించిన దుఃఖంలోనూ ప్రభాస్ తన గొప్ప మనసు చాటుకున్నారు. ఆయన తండ్రి చనిపోయిన రోజే నా ఆస్పత్రి ఖర్చులకు డబ్బులు పంపించి నన్ను కాపాడారు. ఎవరు ఎక్కడ పోతే నాకెందుకులే అనుకోకుండా నా సినిమాకి రచయిత అని నన్ను ఆయన గుర్తించి నా ఆస్పత్రి ఖర్చులకు డబ్బులు పంపించారంటే ప్రభాస్ గొప్పతనం ఎలాంటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కేవలం డబ్బులు పంపించడమే కాదు నా పట్ల ఎంతో కేరింగ్ గా వ్యవహరించారు. ప్రభాస్ చేసిన సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను’ అని ఎమోషనల్ అయ్యారు తోట ప్రసాద్. కాగా చాలా కాలం తర్వాత కన్నప్ప సినిమా ద్వారా ప్రభాస్ తో కలిసి పని చేస్తున్నారు తోట ప్రసాద్.
ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం మారుతి ‘ది రాజా సాబ్’, హను రాఘవపూడి ‘ఫౌజీ’ సినిమాల్లో నటిస్తున్నాడు. వీటితో పాటు స్పిరిట్, సలార్ 2, కల్కి 2 చిత్రాలను డార్లింగ్ కంప్లీట్ చేయాల్సి ఉంది.
ది రాజా సాబ్ సినిమాలో ప్రభాస్
The WORLD is witnessing an ignition BLAZING like never before 💥💥🤙🏻🤙🏻#RecordBreakingRajaSaab ❤️#Prabhas #TheRajaSaab pic.twitter.com/5KUBisLlfP
— The RajaSaab (@rajasaabmovie) October 24, 2024
.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








