AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: అఫీషియల్.. అప్పుడే ఓటీటీలోకి అజిత్, త్రిషల యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 06న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే భారీ ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది. అయతే థియేటర్లలో విడుదలైన నెలరోజుల్లోపే ఈ యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేస్తోంది.

OTT Movie: అఫీషియల్.. అప్పుడే ఓటీటీలోకి అజిత్, త్రిషల యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Ajith Kumar, Trisha
Basha Shek
|

Updated on: Feb 24, 2025 | 3:39 PM

Share

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ సినిమా విదాముయర్చి. తెలుగులో పట్టుదల పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మేయిళ్ తిరుమేని తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో సౌతిండియన్ బ్యూటీ క్వీన్ త్రిష హీరోయిన్ గా నటించింది. అలాగే అర్జున్ సర్జా, రెజీనా కసాండ్రా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా అనివార్య కారణాలతో ఫిబ్రవరి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ్ తో పాటు తెలుగులోనూ ఒకేసారి రిలీజైంది. అజిత్ మేనియాతో ఈ సినిమాకు బాగానే ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక సినిమాలో యాక్షన్ సీక్వెన్సులు కూడా ఆడియెన్స్ ను అలరించాయి. అయితే ఎందుకోగానీ అజిత్ సినిమా లాంగ్ రన్ కొనసాగించలేకపోయింది. దీంతో యావరేజ్ రిజల్ట్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాగా ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ అజిత్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా పట్టుదల సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై అప్ డేట్ వచ్చింది. మార్చి 3 నుంచే ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ మేరక సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది నెట్ ఫ్లిక్స్. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లోనూ అజిత్ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది.

కాగా బ్రేక్‍డౌన్ అనే హాలీవుడ్ సినిమా కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు మేయిళ్ తిరుమేని. ప్రతిష్ఠాత్మక లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. అరవ్, నిఖిల్ సజిత్, దాశరథి, రవి రాఘవేంద్ర, జీవ రవి, గణేశ్ శరవణన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఇక అనిరుధ్ రవిచందర్ అందించిన పాటలు, బీజీఎమ్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

ఇక పట్టుదల సినిమా కథ విషయానికొస్తే.. అర్జున్ (అజిత్), కాయల్ (త్రిష) భార్యాభర్తలు. అజర్‌ బైజాన్‌లో నివాసముంటారు. మనస్పర్థల కారణంగా విడిపోదామని ఇద్దరూ నిర్ణయం తీసుకుంటారు. అయితే విడిపోయే ముందు ఇద్దరూ కలిసి రోడ్ ట్రిప్ వెళతారు. అయితే ఈ ప్రయాణంలో త్రిష కనిపించకుండాపోతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేదే మిగతా స్టోరీ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..