Chhaava Movie: బాక్సాఫీస్ వద్ద ఛావా వసూళ్ల సునామీ.. ఇప్పటివరకు ఎన్ని కోట్లు రాబట్టిందంటే?
విక్కీ కౌశల్ నటించిన 'ఛవా' సినిమా వీకెండ్‌లోనే కాదు, వీక్ డేస్ లోనూ మంచి వసూళ్లు సాధిస్తోంది. ఫలితంగా ఈ సినిమా కలెక్షన్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా రన్ చూస్తుంటే మూడో వారంలో మరిన్ని రికార్డులు బద్దలయ్యే అవకాశముందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

‘ఛావా’ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని చాలా మంది ఊహించలేదు. ఎందుకంటే విడుదలకు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ అంత బాగా లేవు. కాబట్టి సినిమా సూపర్ హిట్ అవుతుందన్న అంచనాలే లేవు. కానీ తీరా థియేటర్లలో విడుదలైన తర్వాత ఈ సినిమా అందరి అంచనాలను తలకిందులు చేసింది. అన్ని వర్గాల నుంచి ఛావా సినిమాకు సానుకూల స్పందన వచ్చింది. దీని ఫలితంగా సినిమా కలెక్షన్లు అమాంతం పెరిగాయి. తాజాగా ఛావా సినిమా కలెక్షన్లు 400 కోట్ల రూపాయలు దాటాయి. ఇది నటుడు విక్కీ కౌశల్ కెరీర్‌లో అతిపెద్ద విజయం అని చెప్పవచ్చు. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ‘ఛావా’ సినిమా తెరకెక్కింది. చారిత్రక కథ కలిగిన ఈ సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నయేసు బాయి పాత్రలో నటించింది. అక్షయ్ ఖన్నా ఔరంగజేబు పాత్రను అద్భుతంగా గ్రేట్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఇలా అందరి కృషి వల్లే ఈ సినిమా సూపర్ హిట్ అయింది.
‘ఛవా’ సినిమా ఫిబ్రవరి 14న విడుదలైంది. ఈ సినిమా 13 రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మొత్తం రూ. 397 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. 14వ రోజు ప్రారంభం నాటికి ఇది రూ.400 కోట్లు దాటింది. ఈ జోరు చూస్తుంటే మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ రూ. 500 కోట్ల క్లబ్ లో చేరే అవకాశముంది. ‘ఛావా’ చిత్ర బృందం ఈ విజయాన్ని పండగలా జరుపుకొంటోంది. శివరాత్రి పండుగ సెలవులు కావడంతో ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో ఛావా సినిమా హాళ్లకు క్యూ కడుతున్నారు. ఈ సినిమా భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా బాగా ఆడుతోంది. ఇక రష్మిక మందన్న సూపర్ హిట్ చిత్రాల జాబితాలో ‘ఛావా’ కూడా చేరిపోయింది. ఆమె గతంలో నటించిన ‘యానిమల్’, ‘పుష్ప 2’ సినిమాలు కూడా బ్లాక్ బస్టర్టుగా నిలిచాయి. ఇప్పుడు ‘ఛావా’ కూడా విజయం సాధించడంతో పాన్ ఇండియా సినిమాలకు రష్మిక లక్కీ హీరోయిన్ గా మారిపోయింది.
400 కోట్ల క్లబ్ లో ఛావా..
#Chhaava shines on its second Wednesday, benefitting from the partial #MahaShivratri holiday… The film records stronger numbers than Tuesday and Monday, maintaining its exceptional run.#Chhaava is set to enter the prestigious ₹ 400 cr Club today [second Thursday; Day 14],… pic.twitter.com/6HCVgJZC1W
— taran adarsh (@taran_adarsh) February 27, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








