- Telugu News Photo Gallery Viral photos Actor Harish Uthaman Wife Chinnu Kuruvila Baby Shower Photos Go Viral
Harish Uthaman: మళ్లీ తండ్రి కాబోతున్న టాలీవుడ్ విలన్.. గ్రాండ్‌గా భార్య సీమంతం.. ఫొటోస్ ఇదిగో
తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాష సినిమాల్లో విలన్ గా తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హరీశ్ ఉత్తమన్. త్వరలోనే ఈ నటుడు తండ్రిగా మరోసారి ప్రమోషన్ పొందనున్నాడు. ఇటీవల అతని భార్య సీమంతం గ్రాండ్ గా జరిగింది.
Updated on: Feb 27, 2025 | 9:32 PM

దక్షిణాది సినిమాల్లో విలన్ పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో హరీశ్ ఉత్తమన్ ఒకడు. కేరళకు చెందిన ఇతను తెలుగుతో పాటు కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో నటిస్తున్నాడు.

పవర్, గౌరవం, ‘శ్రీమంతుడు, దువ్వాడ జగన్నాథం కృష్ణ గాడి వీర ప్రేమగాథ, ఎక్స్‌ప్రెస్ రాజా, జై లవకుశ, అశ్వద్ధామ, వి, నా పేరు సూర్య, నాంది, కంగువా తదితర సినిమాల్లో హరీశ్ ఉత్తమన్ నటించి మెప్పించాడు.

సినిమాల సంగతి పక్కన పెడితే.. హరీష్ ఉత్తమన్ త్వరలోనే తండ్రిగా ప్రమోషన్ పొందనున్నాడు. అతని భార్య చిన్ను కురువిల్లా ప్రస్తుతం గర్భంతో ఉంది.

తాజాగా చిన్న కురువిల్లా సీమంతం వేడుకగా జరిగింది. కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితులు, సన్నిహితులు ఈ వేడుకకు హాజరయ్యారు.

కాగా చిన్న కురువిల్లా హరీశ్ ఉత్తమన్ కు రెండో భార్య. ఈమె కూడా ప్రముఖ నటినే. ‘నార్త్ 24 కతమ్’, ‘కసాబా’, ‘లుక్కా చుప్పి’ తదితర మలయాళ సినిమాల్లో కురువిల్లా నటించింది

గతంలో అమృత అనే మేకప్ ఆర్టిస్టుని పెళ్లి చేసుకున్నాడు హరీశ్. అయితే మనస్పర్థలు రావడంతో ఏడాదికే విడాకులు తీసుకున్నారు.





























