AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: అత్త-మామల వెడ్డింగ్ యానివర్సరీ వేడుకల్లో రామ్ చరణ్.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకారా.. వీడియో

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో షేర్ చేసుకుంటుంది. ముఖ్యంగా తమ సంస్థ అపోలో, ఫ్యామిలీ, చరణ్ గురించి ఎక్కువగా పోస్టులు చేస్తూ ఉంటుంది. అలా తాజాగా ఉపాసన ఒక ఆసక్తికరమైన వీడియోను షేర్ చేసింది

Ram Charan: అత్త-మామల వెడ్డింగ్ యానివర్సరీ వేడుకల్లో రామ్ చరణ్.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకారా.. వీడియో
Ram Charan
Basha Shek
|

Updated on: Feb 27, 2025 | 10:02 PM

Share

మెగా కోడలు ఉపాసన తన తల్లిదండ్రులు అనిల్-శోభన 40వ పెళ్లి రోజు వేడుకలను గ్రాండ్ గా చేసింది. ఈ వేడుకలకు ఉపాసన కుటుంబ సభ్యులు అంతా హాజరయ్యారు. అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సెలబ్రేషన్స్ లో భాగమయ్యాడు. ఇక మెగా ప్రిన్స్ క్లీంకార ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. పార్టీ, సాంగ్స్, డ్యాన్స్, అనిల్ – శోభన దంపతులు రింగ్స్ మార్చుకోవడం.. ఇలా ఎంతో సరదాగా ఈ ఫంక్షన్ జరిగింది. రామ్ చరణ్ కూడా తన అత్తామామలకు కంగ్రాట్స్ తెలిపి వారితో సరదాగా ఎంజాయ్ చేసి, వారితో ఫోటోలు దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఉపాసన తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. 40వ ‘వివాహ వార్షికోత్స‌వ శుభాకాంక్ష‌లు అమ్మ‌-నాన్న. మాపై మీ ఆశీర్వాదం ఎల్ల‌ప్పుడూ ఉంటుంది’ అని తన తల్లిదండ్రులకు విషెస్ చెప్పింది ఉపాసన. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన మెగా అభిమానులు, నెటిజ‌న్లు ఉపాస‌న తల్లిదండ్రులకు బెస్ట్ విషెస్ చెబుతున్నారు.

ఇక ఈ వీడియోలో రామ్ చరణ్ ఫుల్ హెయిర్, గడ్డం తో కనిపించారు. దీంతో మెగా ఫ్యాన్స్ చెర్రీ లుక్ కు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోలో క్లిం కారా కూడా కనిపించింది. అయితే ఎప్పట్లాగే మెగా ప్రిన్స్ ముఖం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. గేమ్ ఛేంజర్ తో ఆశించిన ఫలితం అందుకోలేకపోయిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు తన తర్వాతి సినిమాపై పూర్తిగా దృష్టి సారించాడు. గతంలో ‘ఉప్పెన’ వంటి అద్భుతమైన ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించిన సుకుమార్ శిష్యుడు, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, మున్నాభాయ్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు త్రిపాఠి తదితరులు ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

 కూతురు క్లింకారతో రామ్ చరణ్.. వీడియో

మహా కుంభమేళాలో ఉపాసన..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..