AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Margani Bharat: సినిమా డైలాగులు కొట్టడం కాదు.. పవన్‌ కల్యాణ్‌కు ఎంపీ మార్గని భరత్ సవాల్‌..

Margani Bharat on Pawan Kalyan: వారాహి విజయ యాత్ర రెండో విడతలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు అటు ఏపీలోనే కాదు.. ఇటు తెలంగాణలో సైతం కలకలం రేపాయి. తాడేపల్లిగూడెంలో సభలో మాట్లాడిన పవన్‌ కల్యాణ్‌..

Margani Bharat: సినిమా డైలాగులు కొట్టడం కాదు.. పవన్‌ కల్యాణ్‌కు ఎంపీ మార్గని భరత్ సవాల్‌..
Margani Bharat on Pawan Kalyan
Shaik Madar Saheb
|

Updated on: Jul 13, 2023 | 4:59 PM

Share

Margani Bharat on Pawan Kalyan: వారాహి విజయ యాత్ర రెండో విడతలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు అటు ఏపీలోనే కాదు.. ఇటు తెలంగాణలో సైతం కలకలం రేపాయి. తాడేపల్లిగూడెంలో సభలో మాట్లాడిన పవన్‌ కల్యాణ్‌.. ఆంధ్రప్రదేశ్ లో పర్సనల్‌ డేటా చోరీ అవుతోందని.. అది హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. కాగా.. ఏపీ డేటాపై పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ మార్గని భరత్‌ ఫైర్‌ అయ్యారు. డైలాగులు కొట్టడం కాదు. డేటా మిస్‌ యూస్‌ అవుతుందన్న ఆధారాలు మీ దగ్గర ఉంటే బయటపెట్టండి అంటూ సవాల్‌ చేశారు ఎంపీ భరత్‌. మీ పార్టీ సభ్యులకు సంబంధించిన పర్సనల్‌ డేటా మీ వెబ్‌సైట్లలో ఉన్నప్పుడు ఇది తప్పెలా అవుతుందంటూ.. ఎంపీ పవన్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు.

పవన్‌ కల్యాణ్‌ వాలంటీర్లను మందుబాటిళ్ళతో పోల్చడం అహంకార పూరితం అంటూ వైసీపీ ఎంపీ భరత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు సినిమాల్లో ఉన్నంత మాత్రాన ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దంటూ హితవు పలికారు. నూటికి 80 శాతంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల పట్ల పవన్‌ కల్యాణ్‌ అహంభావం ప్రదర్శిస్తున్నారంటూ ఎంపీ భరత్‌ మండిపడ్డారు.

అయితే, పవన్‌ డేటాపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మార్చాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..