Sri Chaitanya: శ్రీచైతన్య కాలేజీ చైర్మన్ బీఎస్ రావు ఇకలేరు.. బాత్రూమ్‌లో కాలుజారి పడి దుర్మరణం..
శ్రీచైతన్య విద్యాసంస్థల వ్యవస్థాపకులు, చైర్మన్ బీఎన్ రావు కన్నుమూశారు. ఇంట్లోని బాత్రూమ్‌లో కాలు జారి కింద పడటంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆయన్ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు.
శ్రీచైతన్య విద్యాసంస్థల వ్యవస్థాపకులు, చైర్మన్ బీఎన్ రావు కన్నుమూశారు. ఇంట్లోని బాత్రూమ్‌లో కాలు జారి కింద పడటంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆయన్ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు.
బీఎస్ రావు ఇంట్లో బాత్రూమ్‌లో కాలు జరుపడగా.. ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే అపోలో హాస్పిటల్‌కు తరలించారు. అయితే, అప్పటికే ఆయన చనిపోయినట్లు వెల్లడించారు వైద్యులు. బీఎస్ రావు భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు విజయవాడకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడలోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. బీఎస్ రావు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఇతర రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆంధ్రాకు చెందిన బీఎన్ రావు దంపతులు.. ఇంగ్లండ్, ఇరాన్‌లో వైద్యులుగా సేవలించారు. ఆ తరువాత పుట్టిన గడ్డకు వచ్చి.. 1986లో శ్రీ చైతన్య విద్యాసంస్థలను స్థాపించారు. తొలుత విజయవాడలో గర్ల్స్ జూనియర్ కాలేజీని స్థాపించిన బీఎన్ రావు.. అంచెలంచెలుగా కాలేజీలను విస్తరించారు. విజయవాడ నుంచి మొదలైన శ్రీ చైతన్య కాలేజీ ప్రస్థానం.. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగానూ విస్తరించింది. ప్రస్తుత దేశ వ్యాప్తంగా 321 జూనియర్ కాలేజీలు, 322 టెక్నో స్కూల్స్, 107 సీబీఎస్‌ఈ స్కూల్స్ ఉన్నాయి. శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో దాదాపు 8.50 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.