AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kodali Nani: వైఎస్ వివేకా బతికున్నా అవినాష్ రెడ్డికే టిక్కెట్ ఇచ్చేవారు.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..

వైఎస్ వివేకా బతికున్నా.. అవినాష్ రెడ్డికే టిక్కెట్ ఇచ్చేవారంటూ వైఎస్ఆర్‌సీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై కొడాలి నాని సోమవారం స్పందించారు.

Kodali Nani: వైఎస్ వివేకా బతికున్నా అవినాష్ రెడ్డికే టిక్కెట్ ఇచ్చేవారు.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..
Kodali Nani
Shaik Madar Saheb
|

Updated on: Feb 13, 2023 | 9:37 PM

Share

వైఎస్ వివేకా బతికున్నా.. అవినాష్ రెడ్డికే టిక్కెట్ ఇచ్చేవారంటూ వైఎస్ఆర్‌సీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై కొడాలి నాని సోమవారం స్పందించారు. 2024 ఎన్నికల్లో జగన్ అంటే ఏంటో చంద్రబాబు మరోసారి చూస్తారంటూ పేర్కొన్నారు. మార్చి 18వ తేదీ నుంచి జగనన్నే తమ భవిష్యత్తు కార్యక్రమమంటూ తెలిపారు. లోకేష్‌కి తాత గొంతు రావడమేంటీ..? లోకేషుకు వచ్చింది చంద్రబాబు గొంతై ఉంటుందంటూ విమర్శించారు. ఎన్టీఆర్ బతుకుంటే లోకేష్ మాటలు విని ఆత్మహత్య చేసుకుని ఉండేవారంటూ ఎద్దెవా చేశారు. జగనాసుర రక్త చరిత్ర ఎవరు చదువుతారు.. ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం అంటూ టీడీపీకి కౌంటర్‌ ఇచ్చారు. సోషల్ మీడియా ఉందనే ఐ-టీడీపీ పెట్టారని.. అవసరమైతే తడిగుడ్డతో గొంతులు కొయడం ఎలా అని బుక్ రాయమనండి అంటూ కొడాలి నాని ఫైర్‌ అయ్యారు.

వైఎస్ వివేకా వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని పేర్కొన్నారు. చనిపోతే దినం ఖర్చులు.. కాఫీ, టీ ఖర్చులు తప్పితే ఏం లాభమంటూ కొడాలి నాని పేర్కొన్నారు. వైఎస్ వివేకా చనిపోతే ఆస్తులు ఎవరికెళ్లాయి..? వైఎస్ వివేకా చనిపోతే జగన్‌కి ఏమైనా ఆస్తులొచ్చాయా..? అంటూ ప్రశ్నించారు. వైఎస్ వివేకా జగనుతో కలిసి నడిచి వచ్చిన వ్యక్తి కాదు. విజయమ్మ మీద కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడించే ప్రయత్నం చేశారంటూ తెలిపారు. వైఎస్ జగన్ కుటుంబం సర్వనాశనం కోరుకునే వ్యక్తులు వైఎస్ వివేకా ఫ్యామిలీలో ఉన్నారన్నారు.

వైఎస్ భాస్కర్ రెడ్డి కుటుంబమే జగన్ వెంట నడిచిందని తెలిపారు. అందుకే భాస్కర్ రెడ్డి కుటుంబానికే జగన్ టిక్కెట్‌ ఇస్తారని తెలిపారు. టిక్కెట్ ఎవరికివ్వాలో జగన్ ఇష్టం.. వర్ల రామయ్య, పట్టాభి వంటి వాళ్లు చంద్రబాబు జీతగాళ్లు.. అంటూ మండిపడ్డారు. మామను చంపి పదవి తీసుకుంది చంద్రబాబే అంటూ ఫైర్‌ అయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..