Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య మాటల తూటాలు.. రాముడు, రావణుడు అంటూ ప్రచారం..

నెల్లూరు జిల్లా కావలి ఎన్నికల ప్రచారంలో రాముడు, రావణుడు అంటూ మాటల తూటలు పేలుతున్నాయి. వైసీపీ, టీడీపీతోపాటు టీడీపీ నుండి టికెట్టు ఆశించి భంగపడ్డ పసుపులేటి సుధాకర్ ఇండిపెండెంట్‎గా బరిలో ఉన్నారు. దీంతో ఇక్కడ త్రిముఖ పోరు నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రౌడీ అంటూ టీడీపీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. దీంతో రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి కుటుంబ సభ్యులు రంగంలోకి దిగారు.

ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య మాటల తూటాలు.. రాముడు, రావణుడు అంటూ ప్రచారం..
Nellore Ycp Candidate
Follow us
Ch Murali

| Edited By: Ravi Kiran

Updated on: May 02, 2024 | 12:33 PM

నెల్లూరు జిల్లా కావలి ఎన్నికల ప్రచారంలో రాముడు, రావణుడు అంటూ మాటల తూటలు పేలుతున్నాయి. వైసీపీ, టీడీపీతోపాటు టీడీపీ నుండి టికెట్టు ఆశించి భంగపడ్డ పసుపులేటి సుధాకర్ ఇండిపెండెంట్‎గా బరిలో ఉన్నారు. దీంతో ఇక్కడ త్రిముఖ పోరు నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రౌడీ అంటూ టీడీపీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. దీంతో రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి కుటుంబ సభ్యులు రంగంలోకి దిగారు. రాముడు లాంటి ప్రతాప్ రెడ్డి కావాలా.. లేక రౌడీల రాజ్యం కావాలా అంటూ జోరుగా జనంలోకి వెళుతున్నారు.

సిట్టింగ్ ఎమ్మెల్యే కొడుకు బాలసాకేత్ రెడ్డి, కోడలు మహిమ రెడ్డి, కుమార్తె సంహిత, అల్లుడు అఖిలేష్ రెడ్డి ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్‎సీపీకి మద్దతు ఇచ్చి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ ప్రచారానికి వార్డు ప్రజలు బ్రహ్మరథం పట్టి మంగళ హారతులు ఇస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాలని అభ్యర్ధించారు. అలానే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని, కావలి ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డిని మరోసారి గెలిపించాలని కోరారు. ప్రత్యక్ష రాజకీయాల్లో తొలిసారి ఎంపీగా పోటీ చేస్తున్న నెల్లూరు బిడ్డ విజయసాయిరెడ్డిని కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..