ఏపీ ఎన్నికల్లో ఆ పార్టీకే ఎంఐఎం మద్ధతు.. చంద్రబాబుపై అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు

ఏపీలో రాజకీయాలపై స్పందించారు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ. రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇవ్వాలని ఎంఐఎం అధినేత ఓటర్లను కోరారు. ఏపీలో రాజకీయాలు రోజుకో రంగు పులుముకుంటున్నాయి. తాజాగా తెలంగాణకు చెందిన ఎంఐఎం పార్టీ అధినేత అసద్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.

ఏపీ ఎన్నికల్లో ఆ పార్టీకే ఎంఐఎం మద్ధతు.. చంద్రబాబుపై అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు
Asaduddin Owaisi
Follow us

|

Updated on: May 01, 2024 | 5:29 PM

ఏపీలో రాజకీయాలపై స్పందించారు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ. రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇవ్వాలని ఎంఐఎం అధినేత ఓటర్లను కోరారు. ఏపీలో రాజకీయాలు రోజుకో రంగు పులుముకుంటున్నాయి. తాజాగా తెలంగాణకు చెందిన ఎంఐఎం పార్టీ అధినేత అసద్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల హక్కులను కాపాడేందుకు కృషి చేస్తున్న అత్యంత సెక్యులర్ నాయకుడు జగన్ అని హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తెలిపారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవకాశవాది, విశ్వసనీయత లేని నాయకుడని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఒవైసీ.. ఏపీలో ఎన్డీయే అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్‌లను తొలగించేందుకు వెనుకాడబోదన్నారు. విజయవాడలో నిర్వహించిన ర్యాలీలో, ముస్లిం జనాభా పెరుగుదలపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను ఒవైసీ ఖండించారు. ఈ సందర్భంగా మరోసారి ముస్లింలు ఎక్కువగా కండోమ్‌లను ఉపయోగిస్తున్నారని చెప్పారు. ఇదే అంశాన్ని హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో కూడా ప్రస్తావించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles