AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: పైనుంచి చూస్తే టమాటా పెట్టెలే.. లోపల చెక్ చేయగా…

కేసులు ఉన్నా వెనక్కి తగ్గడం లేదు. జైలుకు వెళ్లి వచ్చాక కూడా అదే అక్రమ మార్గాలను అనుసరిస్తున్నారు. పుష్ప రేంజ్ స్కెచ్చులతో పోలీసులను బోల్తా కొట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రజంట్ ఎన్నికల సీజన్. అక్రమార్కుల నక్క జిత్తులు పారడం లేదు.

AP News: పైనుంచి చూస్తే టమాటా పెట్టెలే.. లోపల చెక్ చేయగా...
Tomato Load (Representative image)
Ram Naramaneni
|

Updated on: May 01, 2024 | 3:29 PM

Share

కంత్రీలు.. జగజ్జంత్రిలు..  క్రైమ్ చేయడానికి వీళ్లు చాలా క్రియేటివిటీ వాడుతున్నారు. పోలీసులను మాయ చేసేందుకు పుష్ప రేంజ్‌ ఐడియాలతో రెచ్చిపోతున్నారు. ఎన్నికల వేళ అధికారులు తనిఖీలు విసృతం చేయడంతో వీళ్ల నక్కజిత్తులు పారడం లేదు.  తాజాగా.. తెలంగాణ నుంచి.. పెద్ద మొత్తంలొ లిక్కర్ అక్రమ రవాణాకు యత్నించిన నిందితులును సెబ్ పోలీసుల అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. తుళ్లూరుకు చెందిన పూర్ణచంద్రరావు, గుంటూరుకు చెందిన రామమోహన్‌రావు.. తెలంగాణ నుంచి లిక్కర్ తెచ్చి.. ఆంధ్రాలో అమ్ముకోవాలని ప్లాన్ చేశారు. రామమోహన్‌రావు.. తన లారీతో స్నేహితుడైన శ్రీనివాసరావును తీసుకుని తెలంగాణ వెళ్లాడు. అక్కడ భారీ మొత్తంలో లిక్కర్ కొనుగోలు చేసి.. టమాటా బాక్సులు పెట్టి.. లోపల కనపడకుండా లిక్కర్ సీసాలు అమర్చారు. రామమోహన్‌రావుపై గతంలో కూడా లిక్కర్ అక్రమ రవాణా కేసులు ఉన్నాయి. అందుకే హైవేలపై కాకుండా.. రూరల్ ప్రాంతాల గుండా మద్యాన్ని తీసుకెళ్లేందుకు యత్నించాడు.

అయితే..  ప్రత్తిపాడు సెబ్‌ సీఐ మాధవికి వీరి గురించి పక్కా సమాచారం వచ్చింది.  ఏప్రిల్ 28న రాత్రి.. అధికారులు, సిబ్బంది వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడు వద్ద కాపు కాశారు. లారీని ఆపి చెక్ చేస్తుంటే టమాటా తీసుకెళ్తున్నామంటూ బుకాయించారు. లోతుగా చెక్ చేయడంతో మద్యం బయటపడింది. లారీలోని 133పెట్టెల్లో ఉన్న రూ.8.02లక్షల విలువైన 6,376 లిక్కర్ సీసాలను పోలీసులు సీజ్ చేశారు. రామమోహన్‌రావు, శ్రీనివాసరావులను అరెస్టు చేశామని.. పూర్ణచంద్రరావుతో పాటు తెలంగాణలో నిందితులకు లిక్కర్ అమ్మిన హనుమంతరావునూ అరెస్టు చేయాల్సి ఉందన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పాత బాటిళ్లను కొత్తవాటిలా.. స్టిక్కర్ జిగురు వదిలించే ట్రిక్
పాత బాటిళ్లను కొత్తవాటిలా.. స్టిక్కర్ జిగురు వదిలించే ట్రిక్
రొటీన్ సినిమానే కానీ.. ట్విస్ట్‌తో థ్రిల్‌ వస్తుంది
రొటీన్ సినిమానే కానీ.. ట్విస్ట్‌తో థ్రిల్‌ వస్తుంది
రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. నోరూరించే గోంగూర, మటన్ బోటి
రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. నోరూరించే గోంగూర, మటన్ బోటి
3 లక్షలకుపైగా స్కూటర్ల రీకాల్‌.. ఇందులో మీ స్కూటర్‌ కూడా ఉందా?
3 లక్షలకుపైగా స్కూటర్ల రీకాల్‌.. ఇందులో మీ స్కూటర్‌ కూడా ఉందా?
CPRతో పునర్ జన్మ.. ఎమర్జెన్సీ టైంలో ఫర్‌ఫెక్ట్‌గా ఎలా చేయాలంటే?
CPRతో పునర్ జన్మ.. ఎమర్జెన్సీ టైంలో ఫర్‌ఫెక్ట్‌గా ఎలా చేయాలంటే?
రథ సప్తమి రోజున తప్పక చేయాల్సినవి.. చేయకూడనవి తెలుసా?
రథ సప్తమి రోజున తప్పక చేయాల్సినవి.. చేయకూడనవి తెలుసా?
30 రోజులు ఈ ఆసనం వేశారంటే.. మీ శారీరక, మానసిక ఆరోగ్యం ఫుల్ ఖుష్!
30 రోజులు ఈ ఆసనం వేశారంటే.. మీ శారీరక, మానసిక ఆరోగ్యం ఫుల్ ఖుష్!
కంప్యూటర్ క్లాస్ నుండి వస్తుండగా..!
కంప్యూటర్ క్లాస్ నుండి వస్తుండగా..!
నైన్టీస్ కిడ్స్ అందరికీ మోస్ట్ ఫేవరెట్ సీరియల్ సాంగ్.. ❤️
నైన్టీస్ కిడ్స్ అందరికీ మోస్ట్ ఫేవరెట్ సీరియల్ సాంగ్.. ❤️
నది ఒడ్డున్న చెట్టుకు వేలాడుతున్న యువకుడి మృతదేహాం.. ఆ పక్కనే..
నది ఒడ్డున్న చెట్టుకు వేలాడుతున్న యువకుడి మృతదేహాం.. ఆ పక్కనే..