Andhra Pradesh: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన వైసీపీ
ఏపీ స్థానికసంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను వైసీపీ అనౌన్స్ చేసింది. అభ్యర్థుల జాబితాను సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.
ఏపీ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను వైసీపీ అనౌన్స్ చేసింది. అభ్యర్థులను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఖాళీ అయిన మొత్తం 14 ఎమ్మెల్సీ స్థానాలలో ఇటీవల ముగ్గురు అభ్యర్థుల్ని అనౌన్స్ చేయగా, మిగిలిన 11 ఎమ్మెల్సీ స్థానాలకు తాజాగా అభ్యర్థుల్ని ఫైనల్ చేశారు. మొత్తం 14 స్థానాల్లో బీసీ, ఎస్సీ, మైనార్టీలకు 7 స్థానాలు కేటాయించారు.. కాపు సామాజిక వర్గానికి రెండు, కమ్మ సామాజిక వర్గానికి రెండు, రెడ్డి సామాజిక వర్గానికి రెండు, క్షత్రియ సామాజిక వర్గానికి ఒక స్థానాన్ని కేటాయించారు. పార్టీ కోసం పని చేసిన వారికి గుర్తింపు, సీనియర్లకు అవకాశం కల్పించారు. ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లకు మరోసారి అవకాశం ఇచ్చారు. ఇన్నాళ్లు జగన్ కార్యక్రమాలను కోఆర్డినేట్ చేస్తూ కీలకంగా ఉన్న తలశిల రఘురాంను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు.
- విజయనగరం జిల్లా – ఇందుకూరు రఘురాజు (క్షత్రియ)
- విశాఖ జిల్లా – వరుదు కల్యాణి (బీసీ వెలమ) , వంశీ కృష్ణ ( బీసీ, యాదవ్)
- తూగో.జిల్లా – అనంత ఉదయభాస్కర్ (ఓసీ, కాపు)
- కృష్ణాజిల్లా – తలశిల రఘురాం (ఓసీ, కమ్మ), మొండితోక అరుణ్‌కుమార్ (ఎస్సీ)
- గుంటూరు జిల్లా – ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (కాపు), మురుగుడు హన్మంతరావు (బీసీ)
- చిత్తూరు జిల్లా – కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ (వన్యకుల క్షత్రియ)
- అనంతపురం నుంచి – వై.శివరామిరెడ్డి (రెడ్డి)
- ప్రకాశం జిల్లా- తూమాటి రామారావు (కమ్మ)
Also Read: Viral Video: తునాతునకలైన లారీ.. చక్రాలు మాత్రమే మిగిలాయ్.. డ్రైవర్ పరుగో పరుగు