Viral Video: తునాతునకలైన లారీ… చక్రాలు మాత్రమే మిగిలాయ్.. డ్రైవర్ పరుగో పరుగు

లోడ్‌తో వెళ్తున్న లారీ.. ఓ టర్నింగ్ తీసుకోవాల్సి ఉంది. అది అసలే మట్టి రోడ్డు. దీంతో డ్రైవర్ కాస్త జాగ్రత్తగా నడపాలి. కానీ అతను లైట్ తీసుకున్నాడు.

Viral Video: తునాతునకలైన లారీ...  చక్రాలు మాత్రమే మిగిలాయ్.. డ్రైవర్ పరుగో పరుగు
Lorry Accident
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 12, 2021 | 8:05 PM

ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టా.. ఇలా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఏది ఓపెన్ చేసినా సరే.. వందల వీడియోలు దర్శనమిస్తాయి. అందులో ఫన్నీ వీడియోలను జనాలు బాగా లైక్ చేస్తూ.. వాచ్ చేస్తూ ఉంటారు. ఒకటి ఓపెన్ చేస్తే.. వన్ బై వన్ సజీషన్స్ వస్తూనే ఉంటాయి. అలా మస్త్ టైమ్ పాస్ అవుతోంది. తాజాగా నెట్టింట ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. వైరల్ అవుతోన్న వీడియో ఓ లారీ యాక్సిడెంట్‌కు సంబంధించినది. ఫుల్ లోడ్‌తో వెళ్తున్న లారీ.. ఓ టర్నింగ్ తీసుకోవాల్సి ఉంది. అది అసలే మట్టి రోడ్డు. దీంతో డ్రైవర్ కాస్త జాగ్రత్తగా నడపాలి. కానీ అతను లైట్ తీసుకున్నాడు. అదే స్పీడ్‌లో స్టీరింగ్ గిరగిరా తిప్పేశాడు. అయితే అక్కడ ఊహించని విధంగా పెద్ద బురద కుంట ఉంది.  దీంతో లారీ ఒక్కసారిగా పల్టీ కొట్టింది. విచిత్రమైన విషయం ఏమిటంటే.. లారీ పీసు పీసు అయిపోయింది. ఏ పార్ట్‌కు ఆ పార్ట్ వక్కలయిపోయింది. టాప్ అంతా ముక్కలయిపోగా.. దిగువన ఉన్న లోవర్ బాడీ పార్ట్ మాత్రం డ్రైవర్‌ లేకుండానే అదే స్పీడ్‌లో ముందుకు వెళ్లిపోయింది.

కాసేపు ఏం జరిగిందో డ్రైవర్‌కు అర్థం కాలేదు. వెంటనే తేరుకుని దాని వెనుక పరుగులు తీశాడు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.  నెటిజన్లు భిన్న కామెంట్లు పెడుతున్నారు. పాత సామాన్లకు తప్ప ఇక ఆ లారీ ఎందకూ పనికిరాదని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఓవర్ లోడ్‌ మోయలేక లారీకి చిరాకు వచ్చినట్లు ఉంది.. అందుకే భారం దించుకుని ముందుకెళ్తుంది అని మరో నెటిజన్ పేర్కొన్నాడు.

Also Read: Viral Video: మత్తు చిత్తు చేసుద్ది… మందు ఎక్కువైంది.. మాడు పగిలింది..

Prabhas Fan: షాకింగ్ న్యూస్.. ప్రభాస్‌కి సూసైడ్ నోట్ పంపిన ఫ్యాన్.. వారే కారణమంటూ!