AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas Fan: షాకింగ్ న్యూస్.. ప్రభాస్‌కి సూసైడ్ నోట్ పంపిన ఫ్యాన్.. వారే కారణమంటూ!

ప్రభాస్‌కు ఉన్న ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి సినిమాతో అతని క్రేజ్ దేశాలు, ఖండాలు దాటింది.

Prabhas Fan: షాకింగ్ న్యూస్.. ప్రభాస్‌కి సూసైడ్ నోట్ పంపిన ఫ్యాన్.. వారే కారణమంటూ!
Prabhas Fan Letter
Ram Naramaneni
|

Updated on: Nov 12, 2021 | 3:35 PM

Share

ప్రభాస్‌కు ఉన్న ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి సినిమాతో అతని క్రేజ్ దేశాలు, ఖండాలు దాటింది. ప్రభాస్ ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్. అతడు చేసే సినిమాలు కూడా ఆ రేంజ్‌లోనే ఉన్నాయి ఇప్పుడు. తాజాగా ప్రభాస్‌కి ఓ అభిమాని సూసైడ్ నోట్ పంపండం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే.. ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం రాధే శ్యామ్.  వచ్చే ఏడాది జనవరి 14న ఈ సినిమాను రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ ప్రకటించింది. అయితే సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ మాత్రం రెగ్యులర్‌గా రావడం లేదు. ప్రభాస్ బర్త్ డేకు టీజర్ వదిలారు. ఆ తర్వాత మరో అప్‌డేట్ లేదు. ఈ విషయంపై ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

తాజాగా  తన ఫేవరెట్ స్టార్ ప్రభాస్‌ రాబోయే చిత్రం రాధే శ్యామ్ కు సంబంధించిన  అప్‌డేట్‌లను మేకర్స్ విడుదల చేయకపోవడంతో హర్టయిన ఒక ఫ్యాన్ సూసైడ్ నోట్ రాశాడు. తన ఆత్మహత్యకు యువీ క్రియేషన్స్ టీమ్,  దర్శకుడు రాధాకృష్ణ కారణమని ఆరోపించాడు. తన జీవితంలో ఎప్పుడూ లేఖ రాయలేదని, అయితే మొదటిసారిగా సినిమా కోసం సూసైడ్ నోట్ రాస్తున్నానని పేర్కొన్నాడు. ఇప్పటికే ఎంతో వెయిట్ చేశామని.. ఇక ఓపిక లేదని రాసుకొచ్చాడు. నా చావుతో అయినా అప్‌డేట్స్ ఇస్తారని భావిస్తున్నా.. ఫ్యాన్స్ ఎమోషన్‌తో ఆడుకోవద్దు అంటూ లేఖను ముగించాడు. ప్రస్తుతం ఈ లేఖ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరి ఈ లెటర్‌పై రాధే శ్యామ్ యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Also Read: చేపను కొని.. కట్ చేసి.. లోపల చూడగానే కంగుతిన్నారు…

నడి ఎడారిలో పాపడాల ఫ్రై.. 

Follow Us
సింగరేణి‌ శివంగులు..భూగర్బ గనుల్లో దూసుకెళుతున్న మహిళా కార్మికులు
సింగరేణి‌ శివంగులు..భూగర్బ గనుల్లో దూసుకెళుతున్న మహిళా కార్మికులు
కొత్త ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ఈ చిన్న తప్పు చేస్తే జైలుకే..
కొత్త ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ఈ చిన్న తప్పు చేస్తే జైలుకే..
ఇరుముడి సినిమాలో అయ్యప్ప భక్తలకు ఇష్టమైన పాట.. అసలు నిజమిదే..
ఇరుముడి సినిమాలో అయ్యప్ప భక్తలకు ఇష్టమైన పాట.. అసలు నిజమిదే..
గొరిల్లా పవర్ ఎంతుంటుందో తెల్సా.!
గొరిల్లా పవర్ ఎంతుంటుందో తెల్సా.!
వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సు.. అసదుద్దీన్ ప్రసంగంపైనే అందరి..
వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సు.. అసదుద్దీన్ ప్రసంగంపైనే అందరి..
దొండకాయ పెరుగు పచ్చడి.. తినని వాళ్ళకు కూడా నచ్చేస్తుంది
దొండకాయ పెరుగు పచ్చడి.. తినని వాళ్ళకు కూడా నచ్చేస్తుంది
పసిడి ప్రియులు ఎగిరిగంతేసే వార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి
పసిడి ప్రియులు ఎగిరిగంతేసే వార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి
అమెజాన్ నుంచి ఏఐ 'ట్రాన్స్‌ఫార్మర్' ఫోన్! ఆపిల్, శాంసంగ్‌లకు చెక్
అమెజాన్ నుంచి ఏఐ 'ట్రాన్స్‌ఫార్మర్' ఫోన్! ఆపిల్, శాంసంగ్‌లకు చెక్
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు