Viral Video: నడి ఎడారిలో పాపడాల ఫ్రై.. వీడియో చూస్తే స్టన్ అవ్వాల్సిందే

వంట చేయడం చాలామందికి ఇష్టం. కొందరికి హాబీ. వంట చేసి.. ఇతరులకు పెట్టి.. వారి నుంచి గుడ్ రివ్యూస్ తెచ్చుకోడానికి చాలామంది ఆరాటపడుతూ ఉంటారు.

Viral Video: నడి ఎడారిలో పాపడాల ఫ్రై.. వీడియో చూస్తే స్టన్ అవ్వాల్సిందే
Cooking In Dubai Desert
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 11, 2021 | 7:23 PM

వంట చేయడం చాలామందికి ఇష్టం. కొందరికి హాబీ. వంట చేసి.. ఇతరులకు పెట్టి.. వారి నుంచి గుడ్ రివ్యూస్ తెచ్చుకోడానికి చాలామంది ఆరాటపడుతూ ఉంటారు. ప్రజంట్ అయితే సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో విభిన్న రకాల వంట వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. రోడ్ సైడ్ ఫుడ్ నుంచి.. ఫైవ్ స్టార్ హోటల్ ఫుడ్ వరకు.. కుకింగ్ వీడియో ఏది పెట్టినా ఇట్టే వైరల్ అవుతుంది. ఇలానే టర్కిష్ చెఫ్ బురాక్ ఓజ్డెమిర్ తన విచిత్రమైన వంటలతో సోషల్ మీడియాలో ప్రాచూర్యం పొందాడు. తాజాగా ఇతడు మరో క్రేజీ వంటతో నెటిజన్ల అటెన్షన్ గ్రాచ్ చేశాడు. ఇందులో చెఫ్ బురాక్ దుబాయ్ ఎడారిలో పెద్ద పాన్‌లో పాపడాలు(గొట్టాలు) కుక్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు విపరీతంగా సర్కులేట్ అవుతోంది. ఇప్పటివరకు ఈ వీడియోకు 5.4 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయంటేనే వీడియో ఎంత వైరల్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు.

వైరల్ వీడియోలో, చెఫ్ బురాక్ పాపడాలు వండడానికి ఎడారిలో భారీ సెటప్‌ను ఏర్పాటు చేయడం మీరు చూడవచ్చు. వీడియోలో, చెఫ్ పెద్ద ఇటుకల పైన పెద్ద పాన్‌ను ఏర్పాటు చేశాడు. మంట కోసం పాన్ కింద చెక్కల సంచులను ఉంచాడు. తర్వాత పాన్‌లో నూనె పోసి, స్నేహితుల సహాయంతో, అందులో రంగురంగుల పాపడాలను ఉడికించాడు.

వీడియో వీక్షించండి

View this post on Instagram

A post shared by Burak Özdemir (@cznburak)

ఈ వీడియోను టర్కిష్ చెఫ్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో అక్టోబర్ 17న షేర్ చేశాడు. ఎడారిలో మండుతున్న ఇసుక మధ్య పాపడాలను వేయించాలనే అతని ఆలోచనను ప్రజలు బాగా లైక్ చేస్తున్నారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 98.3 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. చెఫ్ బురాక్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 29.4 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఎడారిలో వంట వీడియోకు కామెంట్లు కూడా ఓ రేంజ్‌లో వస్తున్నాయి.

Also Read: Viral Video: చేపను కొని.. కట్ చేసి.. లోపల చూడగానే కంగుతిన్నారు…