Viral Video: మత్తు చిత్తు చేసుద్ది… మందు ఎక్కువైంది.. మాడు పగిలింది..
మద్యపానం హానికరం. ఎంతో ప్రమాదకరం. తాగితే శరీరం చిత్తవుతుంది. కుటుంబం నాశనమవుతుంది. తాగి వాహనాలు నడుపుతే ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో కూడా మనం చూస్తున్నాం.

మద్యపానం హానికరం. ఎంతో ప్రమాదకరం. తాగితే శరీరం చిత్తవుతుంది. కుటుంబం నాశనమవుతుంది. తాగి వాహనాలు నడుపుతూ తాము ప్రమాదాల బారిన పడటమే కాకుండా.. కొన్నిసార్లు ఎదిటివారి ప్రాణాలు పోయేందుకు కూడా కారకులవుతారు. తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూడటానికి హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ.. అతగాడు ఉన్న పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. ఒక వ్యక్తి విపరీత ప్రవర్తనతో తన తలను షాపు డోర్‌కు బాదుకుంటున్నాడు. అతని పరిస్థితి చూస్తే.. ఫుల్‌గా మద్యం సేవించాడని అర్థమవుతోంది. సరిగ్గా.. నిలబడలేకపోతున్నాడు. అదే పనిగా తలపు షాపు డేర్‌కేసి బాదుకుంటున్నాడు. ఎదురుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు.. అతని ప్రవర్తన చూసి నవ్వుకుంటున్నారు తప్ప ఆపే ప్రయత్నం చేయలేదు. ఇంకో వ్యక్తి అయితే ఏకంగా వీడియో తీసి నెట్టింట వైరల్ చేశాడు. తాగి ఏం చేస్తున్నాడో కూడా ఆ వ్యక్తికి తెలియడం లేదు. వైరల్ అవుతున్న వీడియోను దిగువన చూడండి.
View this post on Instagram
చూశారుగా అయ్యగారి పైత్యం ఏ లెవల్‌లో ఉందో. మందు కిక్కులో ఏం అర్థం కాలేదు కానీ.. అది దిగాక తెలుస్తుంది మాడు పగిలిన విషయం. ఈ వీడియోను ‘funnyvideos1377’ అనే ఖాతా నుంచి ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు వేలాది మంది వీక్షించగా, వందల మంది లైక్ చేశారు. చాలామంది తమదైన స్టైల్లో కామెంట్లు పెడుతున్నారు. కిక్ దిగితే కథ కంచికే బ్రదర్ అని ఓ వ్యక్తి కామెంట్ పెట్టాడు. ఈ వీడియో నీ భార్య కంట పడొద్దని దేవుడ్ని మొక్కుకో అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.
Also Read: Prabhas Fan: షాకింగ్ న్యూస్.. ప్రభాస్‌కి సూసైడ్ నోట్ పంపిన ఫ్యాన్.. వారే కారణమంటూ!