AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Politics: రైతుల ముసుగులో టీడీపీ నేతల దొంగ యాత్రలు.. పోలీసులపై దాడి కూడా వారి పనే.. మంత్రి పేర్నినాని

రైతుల ముసుగులో టీడీపీ నేతలే దొంగ పాదయాత్రలు చేస్తున్నారని ఏపీ రవాణ, సమాచార శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP Politics: రైతుల ముసుగులో టీడీపీ నేతల దొంగ యాత్రలు.. పోలీసులపై దాడి కూడా వారి పనే.. మంత్రి పేర్నినాని
Pr
Basha Shek
|

Updated on: Nov 12, 2021 | 5:44 PM

Share

రైతుల ముసుగులో టీడీపీ నేతలే దొంగ పాదయాత్రలు చేస్తున్నారని ఏపీ రవాణ, సమాచార శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు రైతుల్ని మోసం చేసి వారి పేరుతోనే రియల్ ఎస్టేట్ యాత్ర చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఈ యాత్రకు పాప పరిహార యాత్ర అని పేరు పెట్టుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. శుక్రవారం మంత్రి అమరావతిలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరుతో అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పాదయాత్రలో వాస్తవమైన రైతులెవరూ లేరని.. ఉన్నవారంతా టీడీపీ నేతలేనని ఆరోపించారు. .

‘కోర్టు, న్యాయమూర్తుల కళ్లు కప్పి నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నేతలు ఈ పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్రకి నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ ప్లే మొత్తం చంద్రబాబే. ఈ యాత్రకి చందాల పేరుతో చంద్రబాబు అండ్ కో తమ నల్ల ధనాన్ని తెల్లధనంగా మార్చుకుంటున్నారు. యాత్ర రూట్ మ్యాప్ వెనుక కుట్ర దాగి ఉంది. ఘర్షణలకు దారితీసేలా ఉంది. బీసీ, ఎస్సీ, మైనారిటీలను కవ్వించే విధంగా రూట్ మ్యాప్ ప్లాన్ చేశారు. పాదయాత్రలో రైతుల ముసుగులో టీడీపీ నేతలు పోలీసులపై దాడులు చేస్తున్నారు. చంద్రబాబు తన ఆస్తుల కోసం అమరావతి తప్ప రాష్ట్రంలో ఇంకో ప్రాంతం అభివృద్ధి చెందకూడదని కుట్రలకు పాల్పడుతున్నాడు. మా నాన్న దేవుడు అంటున్న లోకేశ్‌ను పిచ్చాసుపత్రికి తీసుకెళ్లాలి. ఆయనను చదువుకోడానికి అమెరికా పంపితే భూతులు, కుట్రలు నేర్చుకుని వచ్చాడు’ అని మంత్రి ధ్వజమెత్తారు.

Also read:

Andhra Pradesh: స్థానికసంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన వైసీపీ

Amit Shah: తిరుపతిలో అమిత్ షా మూడ్రోజుల పర్యటన ఖరారు.. కేంద్ర హోం మంత్రి పర్యటన వివరాలు

Tiger: నల్లమల అటవీ ప్రాంతంలో.. గూడ్స్ రైలు ఢీకొని పెద్దపులి మృత్యువాత..