Amit Shah: తిరుపతిలో అమిత్ షా మూడ్రోజుల పర్యటన ఖరారు.. కేంద్ర హోం మంత్రి పర్యటన వివరాలు
కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తిరుపతి పర్యటన ఖరారైంది. తిరుపతిలో మూడు రోజుల పర్యటన నిమిత్తం..
కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తిరుపతి పర్యటన ఖరారైంది. తిరుపతిలో మూడు రోజుల పర్యటన నిమిత్తం.. శనివారం (ఈనెల 13న) ఆయన తిరుపతికి రానున్నారు. 14న ఉదయం నెల్లూరులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నిర్వహిస్తున్న ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. అదే రోజు మధ్యాహ్నం తిరుపతిలో సదరన్ జోనల్ సీఎంల భేటీలో అమిత్ షా పాల్గొననున్నారు. ఈ నెల 15న శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం అమిత్‌షా ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.
అమిత్ షా తిరుపతి పర్యటన నేపథ్యంలో చిత్తూరు, నెల్లూరు జిల్లాల పోలీసు యంత్రాంగాలు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నాయి.
Also Read..