AP Rains: వర్షాలు, వరదలతో పొంగిపొర్లుతున్న చెరువులు.. ప్రాణాలను లెక్కచేయకుండా చేపల కోసం జనం ఫీట్లు.. ఎక్కడంటే
Heavy Rains in AP: అల్పపీడనం కారణంగా ఆంధ్ర ప్రదేశ్ లోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం అయ్యాయి. భారీవర్షాలతో..
Heavy Rains in AP: అల్పపీడనం కారణంగా ఆంధ్ర ప్రదేశ్ లోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం అయ్యాయి. భారీవర్షాలతో చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా గత కొన్ని గంటలగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో చెరువులకు వరద పోటెత్తుతోంది. పలు ప్రాంతాలు జల గిగ్బంధంలో చిక్కుకున్నాయి. అనేక చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి.
ఈ క్రమంలో వరద పొంగి పొరలు తున్న చెరువు వద్ద జనం చేపలకోసం ఎగబడుతున్నారు. ఓ వైపు వరద ఉధృతంగా ప్రవహిస్తున్నా లెక్క చేయకుండా చేపలకోసం పీట్లు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా వడమాల పేట మండలం ఎస్బీఆర్ పురంలోని గులూరు చెరువు వరద పోటెత్తడంతో పొంగి ప్రవహిస్తోంది. దాంతో ఈ వరదలో కొట్టుకొస్తున్న చేపల కోసం జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. చేపలను పట్టేందుకు కుస్తీలు పడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Also Read: Kerala-Norovirus: కేరళలో మళ్ళీ వెలుగులోకి వచ్చిన సరికొత్త వైరస్.. నోరో వైరస్.. లక్షణాలు ఏమిటంటే..
విధి నిర్వహణలో తెగువను ప్రదర్శించిన తమిళనాడు లేడీ సూపర్ పోలీస్‌కు ప్రశంసల వెల్లువ..
మావోలకు షాక్.. తలపై కోటి రివార్డ్ ఉన్న మావోయిస్టు అగ్రనేత భార్యతో సహా అరెస్ట్..
హైదరాబాద్ రోడ్ల అభివృద్దికి స్థల సేకరణ వేగవంతం.. GHMC కీలక నిర్ణయం..
విప్లవ సాహిత్యం ప్రింటింగ్ అవుతుందనే సమాచారంతో ప్రింటింగ్ ప్రెస్ లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు