AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maoist Leader RK: మావో అగ్రనేత ఆర్కే జీవిత చరిత్ర పుస్తకంగా ప్రింటింగ్.. ప్రెస్‌‌పై పోలీసులు దాడి .. వెయ్యి పుస్తకాలు స్వాధీనం..

Maoist Leader RK: హైదరాబాద్ లోని ఓ ప్రింట్ ప్రెస్ లో విప్లవ సాహిత్యానికి సంబందించిన పుస్తకాలు ముద్రిస్తున్నారనే సమాచారం పోలీసులు అందింది. దీంతో పోలీసులు..

Maoist Leader RK: మావో అగ్రనేత ఆర్కే జీవిత చరిత్ర పుస్తకంగా ప్రింటింగ్..  ప్రెస్‌‌పై పోలీసులు దాడి .. వెయ్యి పుస్తకాలు స్వాధీనం..
Hyderabad Police
Surya Kala
|

Updated on: Nov 12, 2021 | 8:14 PM

Share

Maoist Leader RK: హైదరాబాద్ లోని ఓ ప్రింట్ ప్రెస్ లో విప్లవ సాహిత్యానికి సంబందించిన పుస్తకాలు ముద్రిస్తున్నారనే సమాచారం పోలీసులు అందింది. దీంతో పోలీసులు సదరు ప్రింట్ ప్రెస్ లోని తనిఖీలు నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే..

ఉస్మానియా విశ్వవిద్యాలయంకు అతి సమీపంలో ఉన్న అంబర్ పేట్ లోని అలీ కేఫ్ దగ్గర ఓ ప్రింట్ ప్రెస్ లో మలక్ పెట్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు.  ఈ ప్రింట్ ప్రెస్ లో రహస్యంగా విప్లవ సాహిత్యం పుస్తకాలు ముద్రిస్తున్నారని పోలీసులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు హఠాత్తుగా దాడి చేసి.. తనిఖీలు చేపట్టారు. అక్కడ మావోయిస్టు దిగవంగత అగ్రనేత ఆర్కే జీవిత చరిత్ర జీవిత చరిత్ర పుస్తకాలుగా ప్రింట్ అవుతున్నట్లు తెలియడంతో పోలీలు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా 1000  బుక్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అడిషనల్ డిసిపి మురళీధరరావు,  మలక్పేట్ ఏసిపి వెంకటరమణ, స్థానిక పోలీసులు పాల్గొన్నారు. నవ్య ప్రింటింగ్ ప్రెస్ లో ఆర్కే జీవిత చరిత్ర కు సంబంధించిన పుస్తకాల ప్రింటింగ్ చేస్తున్నారు. విప్లవ సాహిత్యానికి సంబంధించిన బైండింగ్ చేసిన వెయ్యి పుస్తకాలను సీజ్ చేశామని ఏసీపీ వెంకటరమణ చెప్పారు. అంతేకాదు బైండింగ్ చెయ్యని పుస్తక మెటీరియల్ ని కూడా సీజ్ చేసినట్లు చెప్పారు. అయితే పుస్తకాల ప్రింటింగ్ సంబంధించి ఎలాంటి రిసిప్ట్ లు లేవని.. పుస్తకాలలో నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన భావజాలాన్ని పెంపొందించే విధంగా ఉందని ఏసిపి చెప్పారు. నవ్య ప్రింటింగ్ ప్రెస్ యజమాని రామకృష్ణారెడ్డి గత కొంత కాలంగా మావోయిస్టు అనుబంధ సంఘాలకు తోడ్పపడుతున్నట్టు అనుమానించిన పోలీసులు.. హఠాత్తుగా దాడులు చేశారు.  అక్టోబర్ 14న ఆర్కే అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే.  మావోయిస్టు ఉద్యమానికే జీవితాన్ని ధారాదత్తం చేసిన రామకృష్ణ అలియాస్ ఆర్కేది ఏపీలోని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండ.

Also Read:

నా పెళ్ళికి రండి.. భోజనం చేసి రూ. 7,300 చెల్లించండి .. పిల్లల్ని తీసుకుని రావద్దు.. కండిషన్స్ అప్లై.. ఎక్కడంటే..

విధి నిర్వహణలో తెగువను ప్రదర్శించిన తమిళనాడు లేడీ సూపర్ పోలీస్‌కు ప్రశంసల వెల్లువ..

 మావోలకు షాక్.. తలపై కోటి రివార్డ్ ఉన్న మావోయిస్టు అగ్రనేత భార్యతో సహా అరెస్ట్..

  హైదరాబాద్ రోడ్ల అభివృద్దికి స్థల సేకరణ వేగవంతం.. GHMC కీలక నిర్ణయం..