AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్ రోడ్ల అభివృద్దికి స్థల సేకరణ వేగవంతం.. GHMC కీలక నిర్ణయం..

Hyderabad: హైదరాబాద్ రోజు రోజుకీ ఆధునిక హంగులను అద్దుకుంటూ ప్రపంచ దేశాలను ఆకర్షిస్తుంది. ఓ వైపు ఐటీ సంస్థలు, మరోవైపు ప్రఖ్యాత మెడికల్ హబ్ గా కూడా..

Hyderabad: హైదరాబాద్ రోడ్ల అభివృద్దికి స్థల సేకరణ వేగవంతం.. GHMC కీలక నిర్ణయం..
Ghmc Roads
Surya Kala
|

Updated on: Nov 12, 2021 | 6:37 PM

Share

Hyderabad: హైదరాబాద్ రోజు రోజుకీ ఆధునిక హంగులను అద్దుకుంటూ ప్రపంచ దేశాలను ఆకర్షిస్తుంది. ఓ వైపు ఐటీ సంస్థలు, మరోవైపు ప్రఖ్యాత మెడికల్ హబ్ గా కూడా వాసికెక్కింది. దీంతో రోజు రోజుకీ నగరంలో జనాభా పెరుగుతుంది. దీంతో  పెరుగుతున్న జనాభా అవసరాలకు తగిన విధంగా సదుపాయాలను కల్పించే దిశగా తెలంగాణ సార్కర్ అడుగులు వేస్తోంది. విశ్వనగరంగా మరుగుతున్న హైదరాబాద్ లో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు అవసరాలమేరకు రోడ్ల వెడల్పు నేపథ్యంలో భూసేకరణ ప్రక్రియను జిహెచ్ఎంసి అధికారులు వేగవంతం చేశారు. భూ సేకరణను నిర్థేశిత కాలంలో పూర్తిచేసే దిశగా జిహెచ్ఎంసి ప్రణాళికబద్దంగా ముందుకువెళ్తుంది.

హైదరాబాద్ నగర ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక సదుపాయాల కల్పనలో జిహెచ్ఎంసి అనేక అభివృద్ది కార్యక్రమాలను చేపట్టింది. ముఖ్యంగా నూతన మాస్టర్ ప్లాన్ అమలులో రోడ్ల వెడల్పు, అభివృద్ది, లింకు రోడ్లు, స్లీప్ రోడ్లు, జంక్షన్ అభివృద్ది ఫ్లైఓవర్ అండర్ పాస్ అనేక అభివృద్ది పనులను చేపడుతుంది. టౌన్ ప్లానింగ్ వింగ్ రోడ్ అభివృద్ది ప్లాన్ లో భాగంగా ఆస్తులను గుర్తించి రోడ్డు వెడల్పులో ఆస్తులు కోల్పోయిన వారికి ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారంగా నష్ట పరిహారం చెల్లిస్తుంది. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారంగా భూ సేకరణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు.

టౌన్ ప్లానింగ్ విభాగం ద్వారా గత 5సంవత్సరాల కాలంలో 89 రోడ్లు వెడల్పు పనులు చేపట్టింది. వాటిల్లో 55 రోడ్ల పనుల పూర్తి అయ్యాయి. రహదారులు వెడల్పు కోసం నగరంలో దాదాపు  1805 ప్రాపర్టీస్ సేకరించడం జరిగింది. srdp క్రింద 1100 ప్రాపర్టీస్ సేకరించడం జరిగింది. అదే విదంగా 192 ప్రాపర్టీస్ లను మిస్సింగ్ స్లీప్ రోడ్ల నిర్మాణానికి సేకరించడం జరిగింది. జనరల్ రోడ్ల కోసం 511 ప్రాపర్టీస్ లను సేకరించడం జరిగిందని జీహెచ్ఎంసి అధికారులు తెలిపారు. యస్.ఆర్.డి .పి పనులైన చంచల్ గూడ – సైదాబాద్ ఐ.యస్.సదన్ రోడ్డు, శాస్త్రి పురం – ఆరంఘర్ నుండి జూపార్కు రోడ్ల కోసం భూ సేకరణ పూర్తి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో రోడ్లు వెడల్పులో ఆస్తులు కోల్పోయిన వారికి నష్ట పరిహారం అందించేందుకు టి.డి.అర్ సర్టిఫికెట్లను జారీ చేసి అట్టి మొత్తాన్ని ఆన్ లైన్ ద్వారా చెల్లింపు చేయడం జరుగుతుంది.  ఇప్పటి వరకు సుమారు 350  ఎకరాలను సేకరించినట్లు చెప్పారు.  ఈ భూమిని రోడ్డు వెడల్పు కోసం, మిస్సింగ్ లింక్ రోడ్ల కొరకు, నాలా వెడల్పు , చెరువుల సుందరీకరణ కోసం , ఇతర పనులకోసం వినియోగించనున్నామని తెలిపారు.

Also Read:

నా పెళ్ళికి రండి.. భోజనం చేసి రూ. 7,300 చెల్లించండి .. పిల్లల్ని తీసుకుని రావద్దు.. కండిషన్స్ అప్లై.. ఎక్కడంటే..

విధి నిర్వహణలో తెగువను ప్రదర్శించిన తమిళనాడు లేడీ సూపర్ పోలీస్‌కు ప్రశంసల వెల్లువ..

 మావోలకు షాక్.. తలపై కోటి రివార్డ్ ఉన్న మావోయిస్టు అగ్రనేత భార్యతో సహా అరెస్ట్..