AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harish Rao: కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కోసమే మా పోరాటం.. కేంద్రంతో మాకెలాంటి వ్యక్తిగత పంచాయతీల్లేవు.. మంత్రి హరీశ్‌ రావు

కేంద్రంతో తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి వ్యక్తిగత పంచాయతీ లేదని.. తమ ఆవేదనంతా నీళ్లు, నియామకాలు కోసమేనని మంత్రి హరీష్‌రావు తెలిపారు. ముఖ్యంగా కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కావాలన్నదే తమ అభిమతమని ఆయన పేర్కొన్నారు

Harish Rao: కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కోసమే మా పోరాటం.. కేంద్రంతో మాకెలాంటి వ్యక్తిగత పంచాయతీల్లేవు..  మంత్రి హరీశ్‌ రావు
Basha Shek
|

Updated on: Nov 12, 2021 | 5:22 PM

Share

కేంద్రంతో తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి వ్యక్తిగత పంచాయతీ లేదని.. తమ ఆవేదనంతా నీళ్లు, నియామకాలు కోసమేనని మంత్రి హరీష్‌రావు తెలిపారు. ముఖ్యంగా కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కావాలన్నదే తమ అభిమతమని ఆయన పేర్కొన్నారు. కృష్ణా జలాల వివాదంపై సుప్రీంకోర్టులో దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను ఉప‌సంహ‌రించుకున్నామని, ఇప్పుడు ఎలాంటి అడ్డంకులు లేవు కాబ‌ట్టి కేంద్రం తక్షణమే కొత్త ట్రైబ్యున‌ల్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాలని మంత్రి కోరారు. సిద్ధి పేటలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జ‌లాల పంపిణీపై కొత్త ట్రైబ్యున‌ల్ ఏర్పాటులో జ‌రిగిన ఆలస్యానికి సీఎం కేసీఆరే కార‌ణ‌మ‌ని కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ మంత్రి గ‌జేంద్ర షెకావ‌త్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.

కేంద్రం మా ఆవేదనను అర్థం చేసుకోవాలి..

‘కేంద్రంతో మాకెలాంటి వ్యక్తిగత పంచాయతీలు లేవు. మా తెలంగాణ పోరాటమే నీళ్లు, నిధులు, నియామకాల గురించి. అయితే ఏడేళ్లుగా మేం పోరాడుతున్నా నీళ్ల విషయంలో న్యాయం జరగలేదు. నీళ్లలో న్యాయమైన వాటాకావాలని మేం అడుగుతున్నాం. ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్‌ యాక్ట్‌ ప్రకారం జల వివాదాలపై ఒక రాష్ట్రం ఫిర్యాదు చేస్తే దాన్ని ఏడాదిలోగాపరిష్కరించాలి, లేదా ట్రిబ్యునల్ కు రెఫర్‌ చేయాలి. కానీ కేంద్రం ఏ నిర్ణయం తీసుకోలేదు. అందుకే సీఎం కేసీఆర్‌ ఈ విషయంపై కేంద్రాన్ని తప్పుబట్టారు. కృష్ణా నదీ జల వివాదాలపై రాష్ట్రం ఏర్పడిన 42 వ రోజే కేంద్ర మంత్రి ఉమాభారతితో ఈ విషయంపై చర్చించాం. మనం ఇప్పుడు 2021 నవంబర్ లో ఉన్నాం. మాతాపత్రయాన్ని గజేంద్ర షెకావత్ గారు అర్థం చేసుకోవాలి. ఈ ఏడేళ్లలో మీరు ఒకసారైనా దీనిపై నిర్ణయం తీసుకుని ఉంటే ఇప్పుడు ఇలాంటి సమస్యలు వచ్చేవి కావు. సీఎం, జలవనరుల శాఖ మంత్రిగా నేను, అధికారులు ఏడాది పాటు తిరిగినా కేంద్రం స్పందించ లేదు. అందుకే మేం సుప్రీం గడప తొక్కాం. రాష్ట్ర ప్రయోజనాల కోసంమే ఈ నిర్ణయం తీసుకున్నాం. కానీ కేంద్రంపై గౌరవంతో, దిల్లీ పెద్దలు విజ్ఞప్తి చేయడంతో మళ్లీ కేసు ఉపసంహరించుకున్నాం. ఇప్పటికైనా కేంద్రం దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలి. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా రావాలన్నదే మా ఆవేదనంతా. కేంద్రమంత్రి షెకావత్‌ మా ఆవేదననను అర్థం చేసుకోవాలి. ఆయనపై మాకు గౌరవం ఉంది. ఆయన చిత్తశుద్ధిని మేం శంకించడం లేదు’ అని హరీశ్‌రావు చెప్పుకొచ్చారు.

Also Read:

Harish Rao: ప్రశ్నిస్తే దేశ ద్రోహులుగా ముద్ర వేస్తున్నారు.. బీజేపీపై విరుచుకుపడ్డ హరీష్ రావు..

Mahesh Bank: మహేష్‌ బ్యాంక్‌ కేసులో కీలక మలుపు.. మనీ లాండరింగ్‌ కేసు నమోదు చేసిన ఈడీ

Monkey vs Farmers: అవి కోతులు కావు.. రైతుల పాలిట రాక్షసులు.. పాపం కర్షకులకు కన్నీరే మిగిలింది..!