Monkey vs Farmers: అవి కోతులు కావు.. రైతుల పాలిట రాక్షసులు.. పాపం కర్షకులకు కన్నీరే మిగిలింది..!

Monkey vs Farmers: కోతులు చేసే అల్లరి ఏ రేంజ్‌లో ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఒక కోతి చేసే అల్లరిని తట్టుకోవడమే గగనం.. అలాంటి మందలు మందలుగా కోతులు వచ్చి..

Monkey vs Farmers: అవి కోతులు కావు.. రైతుల పాలిట రాక్షసులు.. పాపం కర్షకులకు కన్నీరే మిగిలింది..!
Monkey Gang
Follow us

|

Updated on: Nov 12, 2021 | 12:51 PM

Monkey vs Farmers: కోతులు చేసే అల్లరి ఏ రేంజ్‌లో ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఒక కోతి చేసే అల్లరిని తట్టుకోవడమే గగనం.. అలాంటి మందలు మందలుగా కోతులు వచ్చి రచ్చ చేస్తే పరిస్థితి ఎంతటి భీకరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా రైతులకు కోతుల తలనొప్పి ఎక్కువైంది. కోతుల కారణంగా కన్నీరే మిగిలే పరిస్థితి నెలకొంది. కోతుల మంద పంట పొలాలపై పడి.. నానా బీభత్సం సృష్టిస్తున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు పదుల సంఖ్యలో వచ్చి పంటలపై పడి ధ్వంసం చేస్తున్నాయి. పెద్దపెల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన గోపగోని శ్రీనివాస్ కౌలు రైతు. కొంత భూమి కౌలుకు తీసుకుని పత్తి పంటను సాగు చేశాడు. అయితే, గత నాలుగు రోజుల నుంచి కోతులు పొలాలపై పడి తిరుగుతున్నాయి. ఈ క్రమంలో శ్రీనివాస్ గౌడ్ పత్తి పంటపైనా పడ్డాయి. పత్తి పంటను పూర్తిగా ధ్వంసం చేశాయి.

పత్తి కాయలను తెంపేసి.. చెట్లను పాడు చేశాయి. దాదాపు రెండెకరాల పత్తి పంటను కోతులు ధ్వంసం చేశాయి. కోతుల వల్ల రూ. 1.50 లక్షల నష్టం వాటిల్లిందని బాధిత రైతు శ్రీనివాస్ వాపోయాడు. పంటలు కాపాడుకునేందుకు టపాసులు కాల్చి, బెదిరించినా కూడా కోతుల దాడి ఆగడం లేదని, ఒక్కోసారి కాపలావున్న రైతులపైనే దాడి చేయడంతో గాయాల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కోతులను అటవి ప్రాంతంలో వదలాలని స్థానిక రైతులు వేడుకుంటున్నారు. కోతుల వల్ల ఎంతో నష్టపోయామని, పరిహారం చెల్లించి తమను ఆదుకోవాలిన రైతులు వేడుకుంటున్నారు.

Also read:

Best Mobile Phones Under 15000: స్మార్ట్ ఫోన్ కొనాలని భావిస్తున్నారా? తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్స్‌ కలిగిన ఫోన్స్ ఇవే..

Bullfighting-Andhra Pradesh: రెండు ఆంబోతుల మధ్య భీకర పోరు.. వీడియో చూస్తే గుండెలదరాల్సిందే..!

Telagram New Features: టెలిగ్రామ్‌ అదిరిపోయే ఫ్యూచర్స్‌.. ఆ కొత్త ఫీచర్స్ ఏంటంటే..!