AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bullfighting-Andhra Pradesh: రెండు ఆంబోతుల మధ్య భీకర పోరు.. వీడియో చూస్తే గుండెలదరాల్సిందే..!

Bullfighting: మనం ఉదయం లేచింది మొదలు కోళ్లు, కుక్కలు, పశువులు, గొర్లు, మేకలను చూస్తూనే ఉంటాం. కోళ్లు, కుక్కలు, పొట్టేళ్లు తమ సహ జీవులతో

Bullfighting-Andhra Pradesh: రెండు ఆంబోతుల మధ్య భీకర పోరు.. వీడియో చూస్తే గుండెలదరాల్సిందే..!
Bull Fighting
Shiva Prajapati
|

Updated on: Nov 12, 2021 | 10:06 AM

Share

Bullfighting: మనం ఉదయం లేచింది మొదలు కోళ్లు, కుక్కలు, పశువులు, గొర్లు, మేకలను చూస్తూనే ఉంటాం. కోళ్లు, కుక్కలు, పొట్టేళ్లు తమ సహ జీవులతో పోట్లాటకు దిగుతుంటాయి. వాటిని చూస్తుంటే కొందరికి ఫన్‌గా అనిపిచంచి ఆసక్తిగా చూస్తుంటారు. మరికొందరు వాటిని ఘర్షణను అడ్డుకుని చెదరగొడుతుంటారు. చిన్న చిన్న జీవులు కాబట్టి అవి పోట్లాడుకోవడం సరదాగా అనిపించొచ్చు. కానీ, ఆంబోతులు పోట్లాడుకునే సమయంలో వాటి జోలికి వెళ్లే సాహసం చేయగలరా? వాటి దరి చేరగలరా? ఇలాంటి భీకర ఘటనే ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో చోటు చేసుకుంది. అమలాపురం హైస్కూల్ సెంటర్‌లో రెండు ఆంబోతులు తీవ్రంగా పోట్లాడుకున్నాయి. వాటి పోరు చూసి స్థానికులు హడలిపోయారు. భారీ కాయంతో ఉన్న రెండు ఆంబోతులు పోట్లాడుకుంటుంటే.. జనాలు భయంతో పరుగులు తీశారు.

మొదట నెమ్మదిగా మొదలైన వాటి పోరు.. ఆ తరువాత భీకరంగా మారింది. దాంతో జనాలు భయపడి పక్కకు జరిగారు. రెండు ఆంబోతులు.. సుమారు గంట పాటు ఒకదానితో మరొకటి పోటీపడి కొట్టుకున్నాయి. ఒళ్లు గగుర్పొడిచేలా కుప్తీ పడ్డ ఆంబోతులను విడదీసేందుకు స్థానికులు ధైర్యం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇక రోడ్డు మధ్యలో ఇవి పోట్లాడుకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎవరిపై తిరగబడతాయో అని కంగారు పడ్డారు. ఇలా కాసేపు పోరాటం సాగిన తరువాత వాటి దారిన అవి వెళ్లిపోయాయి. దాంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

Also read:

Hepatitis: డెంగ్యూతో బాధపడుతున్న వారికి కామెర్లు కూడా సోకే అవకాశం.. లక్షణాలు తెలుసుకుని జాగ్రత్త పడాలి!

Watch Video: ఆసీస్ చేతిలో ఘోర ఓటమి.. అనంతరం పాక్ డ్రెస్సింగ్ రూంలో ఏం జరిగిందంటే? వీడియో మీకోసమే.!

T20 World Cup 2021: ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ దెబ్బ.. సెమీ-ఫైనల్‌ సూపర్ హీరో ఔట్.. భారత సిరీస్‌కు డౌటే..!