Mahesh Bank: మహేష్ బ్యాంక్ కేసులో కీలక మలుపు.. మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ
మహేష్ బ్యాంక్ కేసులో కీలక మలుపు. ఈడీ ఎంట్రీ ఇచ్చింది. మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. కోర్టు మధ్యంతర ఉత్తర్వులు లెక్కచేయకుండా..ఉల్లంఘనలకు..

మహేష్ బ్యాంక్ కేసులో కీలక మలుపు. ఈడీ ఎంట్రీ ఇచ్చింది. మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. కోర్టు మధ్యంతర ఉత్తర్వులు లెక్కచేయకుండా..ఉల్లంఘనలకు పాల్పడింది బ్యాంక్ యాజమాన్యం. పాలసీ నిర్ణయాలపై ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా..వ్యవహరించింది మహేష్ బ్యాంక్ బోర్డు. తన కూతురు, స్టాక్ బ్రోకర్‌ను డైరెక్టర్లుగా నియమించారు బ్యాంక్ ఛైర్మన్ రమేష్. ఈ మొత్తం వ్యవహారంపై ఈడీ రంగంలోకి దిగడంతో..ఏం జరుగుతుందోనని డిపాజిటర్లు ఆందోళన చెందుతున్నారు.
ఇదిలావుంటే.. ఏపీ మహేష్ బ్యాంక్ చైర్మన్ సహా సీఈవో, వైస్ చైర్మన్‌లపై కేసు నమోదయిందైన సంగతి తెలిసిందే. బోగస్ ఓటర్ల నమోదు, ఆర్‌బిఐ నిబంధనలకు విరుద్ధంగా గోల్డ్‌లోన్ జారీ అభియోగాలపై గతంలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు.. బంజారాహిల్స్ ఈ ఏడాది మార్చి నెలలో పోలీసులు కేసు ఫైల్ ,చేశారు.
ఏపీ మహేష్ బ్యాంక్ .. కో-ఆపరేటివ్ బ్యాంకింగ్‌కు కార్పొరేట్ టచ్ ఇస్తూ బిజినెస్‌తో పాటు బ్రాంచ్‌లు పెంచుకుంది. అంతేకాదు సింగిల్ డేలో 850 మంది గోల్డ్ లోన్‌లు మంజూరు చేసి సంచలనం రేపిన చరిత్ర ఏపీ మహేష్ బ్యాంక్‌ది. ఇది పురోగతికి చిహ్నం కాదు… బ్యాంక్ ఎన్నికల కోసం కుతంత్రం అనే విమర్శలు వెల్లువెత్తాయి అప్పట్లో. సుదీర్ఘకాలం చైర్మన్‌గిరిని చేపట్టిన రమేష్ భంగ్.. ఓట్ల కోసం గోల్డ్‌లోన్ ఎత్తుగడ వేశారని.. ఫిర్యాదు కూడా దాఖలైంది. తాజాగా ఏపీ మహేష్ బ్యాంక్ చైర్మన్ రమేష్ భంగ్‌పై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు పోలీసులు.
మహేష్ బ్యాంక్‌లో అవకతవకలు.. బ్యాంకు ఎన్నికల నేపథ్యంలో బోగస్ ఓట్ల నమోదు.. అందుకోసం ఆర్‌బిఐ నిబంధనలకు విరుద్ధంగా అసాధారణ రీతిలో గోల్డ్‌లోన్ల మంజూరి అభియోగాలపై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది.
ఇవి కూడా చదవండి: Type 2 Diabetes: టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు పోస్ట్-కోవిడ్‌లో జాగ్రత్తగా ఉండండి..తాజా అధ్యయనంలో వెలుగు చూస్తున్న సమస్యలు..
Raja Chari: మహబూబ్‌నగర్ టు అంతరిక్షం వయా అమెరికా.. స్పేస్‌లో అడుగుపెట్టిన రాజాచారి..