Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raja Chari: మహబూబ్‌నగర్‌ టు అంతరిక్షం వయా అమెరికా.. స్పేస్‌లో అడుగుపెట్టిన రాజాచారి..

నాసా, స్పేస్‌ ఎక్స్‌ సంస్థలు ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌లోకి పంపించేందుకు ప్రయోగించిన స్పేస్‌ఫ్లైట్‌ స్పేస్‌ఎక్స్‌ క్రూ 3లో ఇండో అమెరికన్‌ రాజాచారి అంతరిక్షంలోకి అడుగు పెట్టారు. రాజాచారితో..

Raja Chari: మహబూబ్‌నగర్‌ టు అంతరిక్షం వయా అమెరికా.. స్పేస్‌లో అడుగుపెట్టిన రాజాచారి..
Raja Chari
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 12, 2021 | 7:15 AM

Astronaut Raja Chari: మహబూబ్‌నగర్‌ టు అంతరిక్షం..వయా అమెరికా. స్పేస్‌ ఎక్స్‌ క్రూ 3లో అంతరిక్షంలో అడుగుపెట్టిన రాజాచారి తెలుగు మూలాలున్న భారతీయుడు. దీంతో ఇక్కడివారు ఆయన విజయయాత్రపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాసా, స్పేస్‌ ఎక్స్‌ సంస్థలు ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌లోకి పంపించేందుకు ప్రయోగించిన స్పేస్‌ఫ్లైట్‌ స్పేస్‌ఎక్స్‌ క్రూ 3లో ఇండో అమెరికన్‌ రాజాచారి అంతరిక్షంలోకి అడుగు పెట్టారు. రాజాచారితో పాటు మిషన్‌ స్పెషలిస్ట్‌ కేయ్‌లా బారోన్‌, వెటరన్‌ అస్ట్రోనాట్‌ టామ్‌ మార్ష్‌బర్న్‌లు అంతరిక్షంలో కాలు మోపారు.

అంతరిక్షంలో అడుగు పెట్టిన రాజాచారి తెలుగు మూలాలున్న వ్యక్తి. ఆయన తండ్రి శ్రీనివాసాచారి ఉస్మానియా యూనివర్సిటీలో చదువు పూర్తి చేసి అమెరికాలో సెటిల్‌ అయ్యారు. శ్రీనివాసాచారి సొంత ఊరు మహబూబ్‌నగర్‌ జిల్లా. అక్కడి నుంచి గణితం బోధించే అధ్యాపకుడిగా పని చేసేందుకు హైదరాబాద్‌ వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివవర్సిలో ఇంజనీరింగ్‌ పూర్తి చేసి పై చదువుల కోసం అమెరికా వెళ్లారు శ్రీనివాసాచారి. అక్కడ ఉద్యోగం చేస్తూ అమెరికన్‌ మహిళ పెగ్గీ ఎగ్‌బర్ట్‌ని వివాహం చేసుకున్నారు. వీరికి 1977 జూన్‌ 24న రాజాచారి జన్మించారు.

చిన్నప్పటి నుంచే అస్ట్రోనాట్‌ కావాలనే లక్ష్యంతో కష్టపడ్డారు రాజాచారి. 1995లో యూఎస్‌ స్టేట్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో చేరారు. 1999లో ఆస్ట్రోనాటికల్‌ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పట్టా తీసుకున్నారు. ఇంజనీరింగ్‌లోనే 2011లో మాస్టర్స్‌ పూర్తి చేశారు. ఆతర్వాత అంతరిక్ష పరిశోధనల కోసం నాసా 2017లో ఎంపిక చేసిన అస్ట్రోనాట్‌ గ్రూప్‌ 22కి ఎంపికయ్యారు రాజాచారి.

2024లో నాసా చంద్రుడి మీద ప్రయోగాల కోసం చేపట్టనున్న ఆర్టెమిస్‌ టీమ్‌కి సైతం ఎంపికయ్యారు. హ్యూస్టన్‌లో నివసిస్తున్న రాజాచారికి భార్య ముగ్గురు పిల్లలు. అంతరిక్ష స్పేస్‌ స్టేషన్‌లో ప్రయోగాలు ముగించుకుని వచ్చాక చంద్రమండల యాత్రకు సిద్ధమవుతారు రాజాచారి.