AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: తేళ్లను పెంచుతున్న అమ్మాయి.. వైరల్‎గా మారిన వీడియో.. నెటిజన్స్ ఫైర్..

చేపలు పెంచడం, గొర్లు పెంచడం, బర్లు పెంచడం, పందులు పెంచడం చూశాం. కానీ ఇప్పుడు తేళ్లను కూడా పెంచుతున్నారు. తేళ్లు పెంచి ఏం చేసుకుంటారోనని మీకు సందేహం రావొచ్చు....

Viral Video: తేళ్లను పెంచుతున్న అమ్మాయి.. వైరల్‎గా మారిన వీడియో.. నెటిజన్స్ ఫైర్..
Scorpion
Srinivas Chekkilla
| Edited By: Rajeev Rayala|

Updated on: Nov 11, 2021 | 10:16 PM

Share

చేపలు పెంచడం, గొర్లు పెంచడం, బర్లు పెంచడం, పందులు పెంచడం చూశాం. కానీ ఇప్పుడు తేళ్లను కూడా పెంచుతున్నారు. తేళ్లు పెంచి ఏం చేసుకుంటారోనని మీకు సందేహం రావొచ్చు. చేపలు, గొర్లు తిన్నట్టుగానే వాటిని తినేందుకు పెంచుతున్నారు. ఈ తేళ్ల పెంపకం వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన తర్వాత కొంతమంది భయపడ్డారు. చాలా మంది ప్రజలు మళ్లీ కరోనా వ్యాప్తి చెందే ఉద్దేశం ఉందా అని కామెంట్ చేస్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఇంటి పైకప్పుపై నల్లటి దుస్తులు ధరించిన బాలిక తేళ్లు పెంచుతున్నట్లు కనిపిస్తోంది. వేల సంఖ్యలో ఎర్రని తేళ్లు ఆమె చుట్టూ తిరుగుతున్నాయి. ఈ దృశ్యం చూస్తే భయపడాల్సిందే. తేలును చూడగానే జనం భయంతో అటు ఇటు పరిగెత్తడం మొదలు పెడతారు, అదేవిధంగా వేల సంఖ్యలో ఉన్న తేళ్ల మధ్య కూడా ఈ అమ్మాయి భయం లేకుండా నిల్చొని కనిపిస్తుంది. అయితే ఆ యువతి భద్రత కోసం కాళ్లకు రబ్బర్ బూట్లు వేసుకుంది. ఈ అమ్మాయి ఎర్రటి తేళ్లను పండిస్తున్న వీడియో బయటకు రావడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ చైనీయులు మళ్లీ ప్రపంచంలో కరోనాను వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారని ప్రజలు అంటున్నారు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో naturallovers_ok అనే ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందో ఇంకా ధృవీకరించబడలేదు. వీడియో చూసిన వారు ఇప్పుడు ఈ అమ్మాయి వాటిని వేయించుకుని తింటుందని కామెంట్ చేశారు. అదే సమయంలో చైనా తన తప్పుల నుంచి గుణపాఠం నెర్చుకోవాలని అంటున్నారు.

Read Also..ప‌ర్వ‌తాల న‌డుమ మేఘాల డాన్స్‌ !! వైరలవుతున్న ప్రకృతి సోయగం !! వీడియో

చెట్లకు కారుతున్న బంగారం.. జిగురుతో వ్యాపారస్థుల క్యాష్.. ఎక్కడంటే..? వీడియో